ETV Bharat / sports

'అదే ఛాంపియన్​ లక్షణం'.. బుమ్రాపై సచిన్ ప్రశంస - బుమ్రాపై సచిన్ ప్రశంసలు

ఆస్ట్రేలియా​తో రెండో టెస్టులో విజయం దక్కించుకున్న టీమ్​ఇండియాను దిగ్గజ క్రికెటర్​ సచిన్ తెందూల్కర్​​ ప్రశంసించారు. రహానె కెప్టెన్​ ఇన్నింగ్స్​తో పాటు బుమ్రా నాయకత్వంలోని ఫాస్ట్​బౌలర్ల సహకారంతో భారత్​ గెలుపొందిదన్నారు.

Sachin Tendulkar's high praise on jasprith bumrah
ఛాంపియSachin Tendulkar's high praise on jasprith bumrahన్​ లక్షణం అదే: తెందూల్కర్
author img

By

Published : Jan 4, 2021, 10:08 AM IST

మెల్​బోర్న్​ టెస్టులో విజయంతో పుంజుకున్న టీమ్​ఇండియాపై దిగ్గజ క్రికెటర్​ సచిన్​ తెందూల్కర్​ ప్రశంసలు కురిపించారు. శతకంతో జట్టు విజయానికి కారణమైన తాత్కాలిక సారథి రహానెతో పాటు కీలక సమయాల్లో వికెట్లు పడగొట్టిన భారత బౌలింగ్​ లైనప్​ను కొనియాడారు.

"ఫాస్ట్​బౌలర్లకు అటాకింగ్​ సారథిగా ఉన్న బుమ్రా ఎక్కువ బాధ్యత తీసుకున్నాడు. పరిస్థితులు చేయిదాటినప్పుడల్లా అతడు మరింత కష్టపడ్డాడు. ఛాంపియన్​ బౌలర్​ లక్షణం అదే. ఓవర్లు వేసేకొద్దీ రాటుదేలిన సిరాజ్​, తన తొలి టెస్టు మ్యాచ్​ ఆడుతున్నట్టు అనిపించలేదు. అతడు తన ప్రణాళికలను బాగా అమలు చేశాడు."

-సచిన్ తెందూల్కర్, మాజీ క్రికెటర్

బాక్సింగ్​ డే టెస్టు తొలిఇన్నింగ్స్​లో 4, రెండో ఇన్నింగ్స్​లో కీలకమైన స్టీవ్ స్మిత్​ సహ మరో వికెట్​ను బుమ్రా పడగొట్టాడు. రహానె.. తెలివిగా జట్టును నడిపించడమే కాకుండా బాధ్యతాయుతమైన బ్యాటింగ్​తో భారత్​ గెలుపును ఖాయం చేశాడని సచిన్ కొనియాడారు.

"రహానె అద్భుతంగా ఆడాడు. ప్రశాంతంగా, స్వీయనియంత్రణలో ఉన్నాడు. అతడికి దూకుడు ఉద్దేశం ఉన్నా నిశ్చలత్వంతో దానిని బ్యాలన్స్​ చేశాడు. బౌండరీలకు అవకాశం ఉన్నప్పుడు వాటిని ఉపయోగించుకుంటూ జాగ్రత్తగా ఆడాడు. అది మంచి ఆలోచన. జడేజా, రహానెల భాగస్వామ్యం చాలా కీలకంగా మారింది. వారి పరుగులు ప్రత్యర్థులను ఒత్తిడిలో పడేశాయి. పంత్ చేసిన పరుగులు కూడా టీమ్ఇండియాకు కలిసొచ్చాయి" అని సచిన్​ తెలిపారు.
ఇదీ చూడండి: రహానె.. కెప్టెన్సీ కోసమే పుట్టాడు: చాపెల్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.