ETV Bharat / sports

'నేను చేస్తున్నాను.. మీరూ అలాగే చేయండి' - సచిన్​ టెండూల్కర్​ తాజా వార్తలు

కరోనాను అరికట్టేందుకు లాక్​డౌన్ అన్ని రోజులు ఇంట్లోనే ఉండాలని ప్రజలను కోరాడు క్రికెట్​ దిగ్గజం సచిన్​ తెందుల్కర్​. కుటుంబంతో తాను ఇంట్లోనే ఉన్నట్లు చెప్పాడు. ప్రధాని మోదీ సూచనలు పాటించాలని ట్వీట్​ చేశాడు.

Sachin Tendulkar
నేను చేసిందే మీరూ చేయండి: సచిన్‌
author img

By

Published : Mar 26, 2020, 1:09 PM IST

కరోనా​(కొవిడ్‌-19)ను ఎదుర్కొనేందుకు ప్రధాని నరేంద్రమోదీ చెప్పినట్టు 21 రోజులు గృహ నిర్బంధంలో ఉండాలని క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందుల్కర్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశాడు. తాను ఇంట్లోనే ఉంటున్నట్లు చెప్పిన మాస్ట​ర్​​.. ఓ వీడియోను ట్వీట్​ చేశాడు. ప్రభుత్వం, వైద్య సిబ్బంది ఎంతచెప్పినా చాలా మంది వారి మాట వినడం లేదని ఆందోళన వ్యక్తం చేశాడు. తన కుటుంబంతో పాటే తానూ 21 రోజులు ఇంట్లోనే ఉంటున్నామన్న సచిన్​.. ప్రజలూ ఎవరింట్లో వారే ఉండాలని కోరాడు.

  • Our government and health experts have requested us to stay at home & not venture out. Yet many people are doing so.
    My family & I are at home, will not be stepping out for the next 21 days.
    I request you all to do the same. #CoronavirusLockdown pic.twitter.com/WG2pkd6Ljc

    — Sachin Tendulkar (@sachin_rt) March 25, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

అంతకముందే మరో ట్వీట్​

చిన్న చిన్న విషయాలు పాటించడం చాలా కష్టమని, అలా చేయాలంటే స్థిరమైన క్రమశిక్షణతో పాటు సంకల్పబలం అవసరమని మరో ట్వీట్​ చేశాడు సచిన్​. ప్రధాని చెప్పినట్లు చేస్తే లక్షలమంది జీవితాలు కాపాడొచ్చని అన్నాడు. కొవిడ్‌-19పై యుద్ధం చేసేందుకు అందరం కలిసికట్టుగా ఉందామని చెప్పాడు.

గంగూలీ సూచనలు

అంతకుముందు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ ట్విట్టర్‌లో మాట్లాడుతూ దేశ ప్రజలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులకు పలు సూచనలు చేశాడు. ప్రస్తుతం మనమంతా పరీక్షాకాలంలో ఉన్నామని.. అయినా సమష్టిగా పోరాడదామని చెప్పాడు. రాష్ట్ర ప్రభుత్వం, వైద్య సిబ్బంది, కేంద్ర ప్రభుత్వం చెప్పిన విషయాలను పాటిద్దామని కోరాడు. ఇంట్లో ఉండటం ఎంతో ముఖ్యమని, సీయ నిర్బంధం చాలా అవసరమని అన్నాడు.

భారత్​లో 606 కేసులు

మరోవైపు ప్రభుత్వం ఎన్ని హెచ్చరికలు చేసినా కొందరు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. ఇష్టానుసారంగా బయటకొచ్చి తిరుగుతున్నారు. దీంతో వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశాలున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారత్‌లో ఇప్పటి వరకు 606 కేసులు నమోదవగా, 10 మంది చనిపోయారు.

ఇదీ చదవండి: సచిన్ ఐదు రికార్డులను కోహ్లీ ఛేదించగలడా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.