ETV Bharat / sports

ఆ బాధతోనే నా కెరీర్​ ముగిసిందనుకున్నా: సచిన్​ - master blaster sachin tennis elbow

ప్రపంచ క్రికెట్​లో దిగ్గజ ఆటగాడిగా పేరు సంపాదించాడు సచిన్​ తెందూల్కర్​. ఎవ్వరికీ సాధ్యం కాని రికార్డులు కైవసం చేసుకున్నాడు. మైదానంలో ప్రశాంతంగా ఉండే మాస్టర్​ బ్లాస్టర్​.. ఒకానొక సమయంలో మాత్రం తన కెరీర్​ ముగిసిందని నిరాశ పడ్డాడట. అయితే ఆ సమయంలో తన శ్రేయోభిలాషుల మద్దతు తనని రక్షించిందని చెప్పుకొచ్చాడు సచిన్​.

Sachin Tendulkar revealed about tennis elbow
ఆ డిప్రెషన్​తోనే నా కెరీర్​ ముగిసిందనుకున్నా: సచిన్​
author img

By

Published : Dec 21, 2019, 6:39 AM IST

టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందూల్కర్​ తాజాగా తన జీవితంలో ఎదురైన ఓ కష్ట సమయాన్ని అభిమానులతో పంచుకున్నాడు. చేతికి విపరీతమైన నొప్పి కలిగించే 'టెన్నిస్‌ ఎల్బో'తో 2004లో సచిన్​ తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. అయితే గాయం బాధ ఉన్నా ఆటమీద ఇష్టంతో ఏడాది క్రికెట్​ను కొనసాగించినట్లు చెప్పాడు. 2005లో ఆపరేషన్​ తర్వాత డిప్రెషన్​లోకి వెళ్లి క్రికెట్​ను వదిలిపెట్టాలనీ అనుకున్నాడట. ఈ విషయాన్ని తాజాగా ఓ కార్యక్రమంలో వెల్లడించాడు.

"టెన్నిస్‌ ఎల్బో అనేది చాలా ఇబ్బందికరమైంది. దీని వల్ల బ్యాట్​ను ఎత్తలేం. అది ఎంత బాధాకరంగా ఉంటుందో అనుభవించిన వారికే తెలుస్తుంది. నొప్పికి ఊపిరి అందీ అందనట్టు ఉంటుంది. ఆ విషయంలో నా పరిస్థితి ఇంకా దారుణం. ఎన్నో ఇంజెక్షన్లు వేయించుకున్నా. ఎంతోమంది వైద్య స్నేహితులు నా బాధను తగ్గించేందుకు ప్రయత్నించారు. అయినా పరిస్థితి మారలేదు. 2005లో శస్త్ర చికిత్స చేయించుకున్నా. అయితే ఆ ఆపరేషన్​ తర్వాత నేను క్రికెట్​ ఆడలేనని అనుకున్నా. ఒక రకమైన నిరాశలోకి వెళ్లిపోయా. రాత్రి పూట నిద్రపట్టక నా స్నేహితులను పిలిచి కారులో లాంగ్​ డ్రైవ్​ వెళ్లేవాడిని. అయితే అలాంటి కష్ట సమయంలో నా భార్య అంజలి, ఆమె తల్లిదండ్రులు సహా కుటుంబ సభ్యులు, స్నేహితులు అండగా నిలిచారు."
- సచిన్​ తెందూల్కర్​, దిగ్గజ క్రికెటర్​

Sachin Tendulkar tennis elbow
సచిన్ తెందూల్కర్​​, అంజలీ

ప్లాస్టిక్​ బంతితో ఆట..

ఆపరేషన్​ తర్వాత చిన్నపిల్లలతో కలిసి ప్లాస్టిక్​ బంతితో ఆడుకున్నట్లు చెప్పాడు సచిన్​. ఆ సమయంలో 10-15 ఏళ్ల పిల్లాడిలా షాట్లు కొట్టలేకపోయాడని.. కవర్​ డ్రైవ్​లు కొడితే పిల్లలు సులభంగా అడ్డుకునేవారని తెలిపాడు. అవన్నీ చూశాక తన కెరీర్​ ముగిసినట్లు భావించినట్లు చెప్పుకొచ్చాడు మాస్టర్​.

Sachin Tendulkar tennis elbow
2005లో శస్త్రచికిత్స చేయించుకున్న సచిన్​

"ప్లాస్టిక్​ బంతితో పిల్లలతో కలిసి ఆడేవాడిని. అప్పుడు నా ఆట చూసి భయమేసింది. కెరీర్​ను​ ఇలా ముగించవద్దు అని దేవుడిని కోరుకున్నా. కచ్చితంగా మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టాలని అనుకున్నా. ఆపరేషన్​ అయిన 4-5 నెలల తర్వాత శ్రీలంకతో తొలి వన్డే ఆడాను. ఆ రోజును ఎప్పటికీ మర్చిపోలేను. మళ్లీ బ్యాట్​ పట్టుకునేందుకు సహాయం చేసినందుకు దేవుడికి ఎన్నోసార్లు ధన్యవాదాలు చెప్పా."
- సచిన్​ తెందూల్కర్​, దిగ్గజ క్రికెటర్​

200 టెస్టులు ఆడిన సచిన్​ 15వేల 921 పరుగులు, 463 వన్డేల్లో 18వేల 426 రన్స్​ సాధించాడు. అంతర్జాతీయ కెరీర్​లో 51 టెస్టు సెంచరీలు, 49 వన్డే శతకాలు నమోదు చేశాడు. 2013లో క్రికెట్​కు రిటైర్మెంట్​ ప్రకటించాడు.

జపాన్​ సరికొత్త విధానం..

'టెన్నిస్‌ ఎల్బో'కు శస్త్రచికిత్స అవసరం లేదని ఇటీవలె జపాన్‌ శాస్త్రవేత్తలు తెలిపారు. ఇందుకోసం సమర్థమైన చికిత్సను కనుగొన్నామని చెప్పారు.
ఈ వ్యాధిని 'లేటరల్‌ ఎపికాండిలైటిస్‌' అని పిలుస్తారు. క్రీడలు, టైపింగ్‌, కుట్లు వంటి పనులతో కలిగే రిపిటేటివ్‌ స్ట్రెస్‌ గాయాల (ఒక పనిని పదేపదే చేయడం వల్ల కండరాలకు గాయాలవ్వడం) వల్ల ఈ సమస్య వస్తుంది. అయితే ట్రాన్స్‌క్యాథెటర్‌ ఆర్టీరియల్‌ ఎంబోలైజేషన్‌ (టీఏఈ) అనే విధానం ద్వారా ఈ సమస్యను పరిష్కరించవచ్చని తెలిపారు వైద్యులు. ఇది శస్త్రచికిత్స అవసరంలేని విధానమని... గాయమైన ప్రాంతానికి అసాధారణ స్థాయిలో జరిగే రక్త ప్రవాహాన్ని ఇది తగ్గిస్తుందని చెప్పుకొచ్చారు. ఫలితంగా వాపు, నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుందన్నారు.

Sachin Tendulkar tennis elbow
టెన్సిస్​ ఎల్బో

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast channels only. No social media use, no internet use. Must on-screen credit LFCTV. Must keep LFCTV logo. No Archive. No commercial use (including advertisement serving). Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Liverpool, England, UK. 20th December, 2019.
++SHOTLIST TO FOLLOW++
1. 00:00 SOUNDBITE (Japanese): Takumi Minamino, Liverpool & Japan:
"
SOURCE: LFCTV
DURATION: 00:56
STORYLINE:
Liverpool's new signing Takumi Minamino said it was "a dream" to play for the club after his move from Austrian club Red Bull Salzburg.
The Japanese winger will officially become a Liverpool player on 1st Januiary but spoke to the club's in-house TV channel on Friday sand said that he "never thought" he would be able play for the club.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.