దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్.. ముంబయిలోని తన నివాసంలో వర్షంలో తడుస్తూ ఎంజాయ్ చేశాడు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుతెచ్చుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. దీనిని తన కుమార్తె సారా చిత్రీకరించినట్లు తెలిపాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
"ఈ వర్షాన్ని ఎంతో ఆనందంగా ఆస్వాదిస్తున్నాను. నా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయి. నాకిష్టమైన కెమెరాఉమన్ సారా దీనిని చిత్రీకరించింది" అంటూ సచిన్ రాసుకొచ్చాడు. "అతనిలోని చిన్నపిల్లాడు ఇంకా అలానే ఉన్నాడు, ఈ ముంబయి వర్షాలను ఎంజాయ్ చేస్తున్నాడు" అంటూ సారా చెప్పుకొచ్చింది.
లాక్డౌన్ ప్రారంభంనుంచి ఇంటికే పరిమితమైన సచిన్.. రకరకాల వ్యాపకాలతో బిజీగా గడుపుతున్నాడు. వంట చేయడం, తనయుడు అర్జున్‌కు హెయిర్ కటింగ్ సహా టెన్నిస్ ఆడటం లాంటి పనులు చేస్తున్నాడు.
ఇది చూడండి : ఐపీఎల్ దుబాయ్‌లోనే.. త్వరలో తుది నిర్ణయం!