ETV Bharat / sports

భారత క్రికెటర్లపై సచిన్ తెందూల్కర్ ప్రశంసలు

author img

By

Published : Oct 14, 2019, 3:21 PM IST

దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్​లో టీమిండియా క్రికెటర్లు అద్భుతంగా ఆడారన్నాడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్. ఈ సిరీస్​ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది కోహ్లీసేన.

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్

టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్‌ తెందూల్కర్‌ భారత జట్టును అభినందించాడు. 2-0 తేడాతో దక్షిణాఫ్రికాపై టెస్టు సిరీస్‌ విజయం సాధించింది కోహ్లీసేన. తద్వారా స్వదేశంలో వరుసగా 11 టెస్టు సిరీస్‌లు గెలుపొందిన జట్టుగా నిలిచింది. ఈ ఘనత సాధించేందుకు ఆటగాళ్లు అద్భుతంగా ఆడారని మాస్టర్‌ బ్లాస్టర్‌ ట్వీట్‌ చేశాడు.

sachin tendulkar tweet
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్ ట్వీట్
విశాఖపట్నం వేదికగా జరిగిన తొలి టెస్టులో 203 పరుగులతో భారీ విజయం సాధించిన కోహ్లీ సేన, పుణె వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌ 137 పరుగుల తేడాతో గెలిచి సిరీస్​ను సొంతం చేసుకుంది.

పుణె టెస్టులో కెప్టెన్‌ కోహ్లీ(254*) వీరోచితంగా ఆడి కెరీర్‌లోనే అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ సాధించాడు. అనంతరం 601/5తో ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది టీమిండియా. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్​లో దక్షిణాఫ్రికా 275 పరుగులకు ఆలౌట్‌ అయింది. పర్యటక జట్టును ఫాల్‌ఆన్‌కు ఆహ్వానించాడు భారత కెప్టెన్. రెండో ఇన్నింగ్స్​లోనూ టీమిండియా బౌలర్లు విజృంభించడం వల్ల డుప్లెసిస్‌ సేన 189 పరుగులకే కుప్పకూలి సిరీస్‌ను చేజార్చుకుంది.

టీమిండియా కెప్టెన్‌ ఈ మ్యాచ్‌తో పలు రికార్డులు బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. మాజీ సారథి ధోనీ తర్వాత జట్టు పగ్గాలు అందుకున్న కోహ్లీ.. 2015 నుంచి స్వదేశంలో జరిగిన ప్రతి టెస్టు సిరీస్‌ను గెలిపించాడు.

AP Video Delivery Log - 0800 GMT News
Monday, 14 October, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0759: India Netherlands AP Clients Only 4234640
Netherlands royals meet Indian Prime Minister
AP-APTN-0753: India Collapse AP Clients Only 4234639
At least 12 killed after a two-story house collapses
AP-APTN-0744: Luxembourg EU Turkey AP Clients Only 4234637
EU FMs comment on Turkey's offensive in Syria
AP-APTN-0709: Turkey Syria Border AP Clients Only 4234634
Explosions in Syria as Turkish offensive continues
AP-APTN-0701: Australia Turkey Syria No Access Australia 4234635
Australia FM: Turkey to blame for IS escapes
AP-APTN-0625: China SKorea Football AP Clients Only 4234633
SKorean football team departs Beijing for NKorea
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.