మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్‌ను అభిమానులు.. క్రికెట్ దేవుడుగా ఆరాధిస్తారు. క్రికెట్ చరిత్రలో ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. అలాంటి దిగ్గజ క్రికెటర్ కూడా తన తొలి సెలక్షన్లో ఎంపిక కాలేదట. ఆ సమయంలో చాలా బాధపడినట్లు చెప్పుకొచ్చాడు లిటిల్ మాస్టర్. శుక్రవారం.. మహరాష్ట్రలోని ఓ పాఠశాల విద్యార్థులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన సచిన్.. పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.
-
I am happy to have been involved in the development of this school in the remote village of Irlewadi. Interacting with the kids there was a wonderful experience - these children will make our country proud one day, I wish them and their teachers the very best. pic.twitter.com/MC5TES9jf4
— Sachin Tendulkar (@sachin_rt) October 25, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">I am happy to have been involved in the development of this school in the remote village of Irlewadi. Interacting with the kids there was a wonderful experience - these children will make our country proud one day, I wish them and their teachers the very best. pic.twitter.com/MC5TES9jf4
— Sachin Tendulkar (@sachin_rt) October 25, 2019I am happy to have been involved in the development of this school in the remote village of Irlewadi. Interacting with the kids there was a wonderful experience - these children will make our country proud one day, I wish them and their teachers the very best. pic.twitter.com/MC5TES9jf4
— Sachin Tendulkar (@sachin_rt) October 25, 2019

"ముంబయి జట్టులో చోటు కోసం తొలిసారి ట్రయల్స్‌కు వెళ్లినప్పుడు నన్ను ఎంపిక చేయలేదు. అప్పుడు చాలా బాధపడ్డాను. ఆటపై దృష్టిపెట్టాలని సెలక్టర్లు సూచించారు. నిజానికి నేను బాగా బ్యాటింగ్ చేయగలనని తెలుసు. కాని నేను అనుకున్నట్లు ఫలితం రాలేదు. అందుకే నిరుత్సాహపడకుండా విపరీతమైన సాధన చేసి నన్ను బాగా మెరుగుపర్చుకున్నా. మీరూ మీ లక్ష్యాలు సాధించేందుకు కష్టపడండి. మంచి ఫలితాలు రావాలంటే దగ్గర దారులు పనిచేయవు"
-- సచిన్ తెందూల్కర్, దిగ్గజ క్రికెటర్

తన లక్ష్యం కోసం చిన్నప్పటి నుంచే కలలుగని.. సాకారం చేసుకున్నట్లు చెప్పాడు మాస్టర్. ఈ ప్రయాణంలో ఎందరో తనకు తోడ్పడ్డారని అన్నాడు. తొలిసారి క్రికెట్ బ్యాట్‌ను... తన అక్క బహుమతిగా ఇచ్చి ప్రోత్సహించిందని గుర్తుచేసుకున్నాడు.

" నిజానికి స్కూలు స్థాయిలోనే టీమిండియా తరఫున ఆడాలని ఉండేది. 11 ఏళ్లప్పుడు క్రికెట్ ప్రయాణం మొదలుపెట్టా. తర్వాత కుటుంబ సహకారం, కోచ్ ఆచ్రేకర్ మద్దతుతో మంచి స్థాయికి ఎదిగాను".
--సచిన్ తెందూల్కర్, దిగ్గజ క్రికెటర్

సచిన్.. ఎంపీగా ఉన్న సమయంలో, ఎంపీలాడ్స్ నిధుల ద్వారా ఆ పాఠశాలలో మూడు గదులు, ఓ స్టేజీ నిర్మించాలని సూచించాడు.