ప్రపంచ వ్యాప్తంగా పేరున్న భారతీయ దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్. ఈ ఆటగాడు 2013లో అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పేశాడు. తాజాగా ఆస్ట్రేలియాలోని కార్చిచ్చు బాధితుల కోసం ఆ దేశ బోర్డు నిర్వహించిన 'బుష్ఫైర్ క్రికెట్ బాష్' కోసం మళ్లీ బ్యాట్ పట్టాడు మాస్టర్. ఆస్ట్రేలియా క్రీడాకారిణి ఎలిస్ పెర్రీ ఒక్క ఓవర్ ఆడాలన్న ఛాలెంజ్‌ను లిటిల్ మాస్టర్ స్వీకరించాడు. ఆరు బంతుల్లో అద్భుతమైన ఫోర్లు కొట్టి నాటౌట్‌గా నిలిచాడు.
![cricket](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6010727_sachin.jpg)
200 టెస్టులు ఆడిన సచిన్ 15వేల 921 పరుగులు, 463 వన్డేల్లో 18వేల 426 రన్స్ సాధించాడు. అంతర్జాతీయ కెరీర్లో 51 టెస్టు సెంచరీలు, 49 వన్డే శతకాలు నమోదు చేశాడు. 2013లో నవంబర్ 14న క్రికెట్‌కు పూర్తిగా రిటైర్మెంట్ ప్రకటించాడు.
-
Sachin is off the mark with a boundary!https://t.co/HgP8Vhnk9s #BigAppeal pic.twitter.com/4ZJNQoQ1iQ
— cricket.com.au (@cricketcomau) February 9, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Sachin is off the mark with a boundary!https://t.co/HgP8Vhnk9s #BigAppeal pic.twitter.com/4ZJNQoQ1iQ
— cricket.com.au (@cricketcomau) February 9, 2020Sachin is off the mark with a boundary!https://t.co/HgP8Vhnk9s #BigAppeal pic.twitter.com/4ZJNQoQ1iQ
— cricket.com.au (@cricketcomau) February 9, 2020
ఇదీ చూడండి : భారత్- కివీస్ మ్యాచ్‌లో ఈ వ్యక్తిని గమనించారా?