దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ జట్ల మధ్య శుక్రవారం జరగాల్సిన తొలి వన్డే కరోనా కారణంగా వాయిదా పడింది. ఓ సఫారీ క్రికెటర్‌కు కొవిడ్ పాజిటివ్‌గా తేలడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇరుదేశాల బోర్డులు సంయుక్త ప్రకటన చేశాయి. అయితే ఆ ఆటగాడు ఎవరనేది మాత్రం చెప్పలేదు. ఈ మ్యాచ్‌ను ఆదివారం నిర్వహించనున్నట్లు తెలిపారు.
మిగతా రెండు వన్డేలను డిసెంబరు 7, 9 తేదీల్లో జరపనున్నట్లు దక్షిణాఫ్రికా బోర్డు వెల్లడించింది. ఇటీవల జరిగిన టీ20 సిరీస్‌ను 3-0 తేడాతో ఇంగ్లాండ్ గెలుచుకుంది.
'బిగ్‌బాష్'లోనూ కరోనా
బిగ్‌బాష్ లీగ్‌లో బ్రిస్బేన్ హీట్ తరఫున ఆడాల్సిన ముజిబర్ రెహ్మన్‌కు రెండోసారి చేసిన పరీక్షల్లో కొవిడ్ ఉన్నట్లు తేలింది. దీంతో మరికొన్ని రోజుల పాటు అతడు క్వారంటైన్‌లోనే ఉండనున్నాడు. గత వారం ఆస్ట్రేలియా చేరుకున్న ముజిబర్.. వైద్యపరీక్షలు చేయించుకోగా, కరోనా ఉన్నట్లు తేలింది. అప్పటినుంచి క్వీన్లాండ్స్లో స్వీయ నిర్భంధంలో ఉంటున్నాడు.