దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డుకు షాక్ తగిలింది. జట్టు ఎంపికలో బోర్డు సరైన విధంగా వ్వవహరించడం లేదనే ఆరోపణల నేపథ్యంలో క్రికెట్ బోర్డును సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది ఆ దేశ ప్రభుత్వం. బోర్డులోని ఉన్నతాధికారులు తక్షణమే వారి పదవుల నుంచి వైదొలగాలని ఆదేశించడం సహా ఇప్పటినుంచి క్రికెట్ తమ పర్యవేక్షణలో సాగుతుందని పేర్కొంది. అయితే ఐసీసీ నిబంధనల ప్రకారం ప్రతి క్రికెట్ బోర్డు స్వయం ప్రతిపత్తి కలిగి ఉంటుంది. క్రికెట్ వ్యవహారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం ఐసీసీ రూల్స్‌కు విరుద్ధం. తాజా పరిణామంపై అంతర్జాతీయ క్రికెట్ మండలి ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.
గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్‌లో ఘోరంగా విఫలమైన సఫారీ జట్టు.. కేవలం మూడు మ్యాచ్‌ల్లో గెలిచి ఇంటిముఖం పట్టింది. డివిలియర్స్ రిటైర్మెంట్ను వెనక్కు తీసుకుని తిరిగి జట్టులోకి వస్తానన్నా సరే.. ఆ విషయం పట్టించుకోవడం మానేశారు. దీంతో పాటు బోర్డులో అంతర్గత కుమ్ములాటలు, సభ్యులు అధికార దుర్వినియోగానికి పాల్పడటం లాంటి అంశాలు తలనొప్పిగా మారుతుండటం వల్ల ప్రభుత్వం జోక్యం చేసుకుంది.
![SA gov suspends CSA](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8758236_thumbnail_3x2_jhgvhjf_1109newsroom_1599788808_570.jpg)