ETV Bharat / sports

ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్​లకు రుతురాజ్ దూరం​! - csk corona

చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు రుతురాజ్​ గైక్వాడ్ యూఏఈలో ప్రాక్టీస్ ప్రారంభంలోనే​ కరోనా బారిన పడ్డాడు. తాజాగా ఇతడికి మరో రెండు సార్లు పరీక్షలు నిర్వహించనున్నట్లు ఫ్రాంచైజీ అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే లీగ్​లో కొన్ని మ్యాచ్​లకు గైక్వాడ్ దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Gaekwad
గైక్వాడ్​
author img

By

Published : Sep 13, 2020, 3:54 PM IST

ఇటీవలే కరోనా బారిన పడ్డ చెన్నై సూపర్​ కింగ్స్​ బ్యాట్స్​మన్​ రుతురాజ్ గైక్వాడ్​​ మరో రెండు సార్లు పరీక్షలు చేయించుకోనున్నాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్​లో కొన్ని మ్యాచ్​లకు దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

"రుతురాజ్​కు ప్రోటోకాల్​ ప్రకారం.. ఆదివారం, సోమవారం రెండు పరీక్షలు చేస్తారు. వీటిలో నెగిటివ్​ తేలితే అతడిని తిరిగి బయో బబుల్​లోకి అనుమతిస్తారు. ఇతర సిబ్బంది కరోనా నుంచి కోలుకుని సాధారణ స్థితికి చేరుకున్నారు. జట్టుతో కూడా కలిసిపోయారు."

-కేఎస్​ విశ్వనాథన్​, సీఎస్కే సీఈఓ

సీఎస్కే బృందంలో గైక్వాడ్​, చాహర్ సహా 13 మంది సభ్యులు కరోనా బారిన పడ్డారు. అయితే, 14 రోజుల క్వారంటైన్​ సమయంలో చాహర్​తో పాటు మిగిలిన 11 మంది కోలుకున్నారు. ఈ క్రమంలోనే తిరిగి శిక్షణ ప్రారంభించాడు చాహర్​.

కొవిడ్​ పరీక్షల్లో నెగిటివ్ వచ్చిన అనంతరం.. గైక్వాడ్​ ఫిట్​నెస్​ను నిర్ధరించేందుకు హృదయ, ఊపిరితిత్తుల పనితీరుపై టెస్టులు నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే లీగ్​ ప్రారంభ మ్యాచ్​ల్లో కొన్నింటిని గైక్వాడ్​ కోల్పోయే అవకాశాలున్నట్లు కనిపిస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.