టెస్టుల్లో సుస్థిరమైన స్థానం కోసం ఆరాటపడుతోన్న రోహిత్‌కు దక్షిణాఫ్రికా సిరీస్ మంచి అవకాశం కానుంది. ఈ సిరీస్‌లో తొలిసారిగా ఓపెనింగ్ చేయనున్నాడు హిట్‌మ్యాన్. అయితే ఈ విషయంపై మాజీ ఆటగాడు లక్ష్మణ్.. రోహిత్‌కు కొన్ని సూచనలు ఇచ్చాడు.
"రోహిత్‌కు ఉన్న అనుభవం అతడికో వరం. నేను ఓపెనింగ్ చేసినప్పుడు నాకంత అనుభవం లేదు. నాకు కేవలం 4 టెస్టు మ్యాచ్‌ల తర్వాత ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం వచ్చింది. కానీ రోహిత్‌కు 12 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉంది. అతడికున్న పరిణతిని ఉపయోగించి విజయవంతం అవ్వాలి."
-లక్ష్మణ్, టీమిండియా మాజీ ఆటగాడు
టీమిండియా మాజీ ఆటగాడు వి.వి.ఎస్ లక్ష్మణ్ మిడిలార్డర్లో మంచి ప్రదర్శన చేయగలడు. కానీ 1996-98 కాలంలో అతడిని ఓపెనర్‌గా పంపాలని నిర్ణయించింది యాజమాన్యం. ఆ స్థానంలో కుదురుకోలేక పోయాడు లక్ష్మణ్. అదే తప్పు రోహిత్ చేయొద్దని చెప్పుకొచ్చాడీ మాజీ క్రికెటర్.
"ఓపెనర్‌గా టెక్నిక్‌ను మార్చడానికి ప్రయత్నించా. అది అంత విజయవంతం కాలేదు. ఇలాంటి తప్పును రోహిత్ చేయడని భావిస్తున్నా. సహజమైన ఆటపై దృష్టి పెడితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. రోహిత్ మంచి ప్రతిభావంతుడు. అతడు ఒకసారి కుదురుకుంటే ప్రత్యర్థి జట్టుకు ఇబ్బందే. దక్షిణాఫ్రికా సిరీస్‌లో మూడు టెస్టులకు హిట్‌మ్యాన్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించాలి. సెలక్టర్లు అతడిపై నమ్మకముంచాలి."
-లక్ష్మణ్, టీమిండియా మాజీ ఆటగాడు
పరిమిత ఓవర్ల క్రికెట్లో తనదైన శైలిలో ప్రత్యర్థి జట్టుపై విరుచుకుపడే రోహిత్ టెస్టుల్లో తొలిసారి ఓపెనింగ్ చేయనున్నాడు.
ఇవీ చూడండి.. అప్పుడు నగ్నచిత్రంతో.. ఇప్పుడు వీడ్కోలుతో షాక్!