ETV Bharat / sports

2020లో రోహిత్ ఈ 3 రికార్డులు బ్రేక్ చేస్తాడా? - india cricket team

భీకరఫామ్​లో ఉన్న భారత క్రికెటర్ రోహిత్ శర్మ.. ఈ సంవత్సరమూ అదే జోరు కొనసాగించాలని అభిమానులు ఆశిస్తున్నారు. అరుదైన రికార్డులు తన ఖాతాలో వేసుకునేందుకు అడుగుదూరంలో ఉన్నాడు. 2020లో హిట్​మ్యాన్ వాటిని అధిగమిస్తాడో లేదో చూడాలి.

indian cricketer rohit sharma
2020లో రోహిత్ ఈ 3 రికార్డులు బ్రేక్ చేస్తాడా?
author img

By

Published : Jan 8, 2020, 6:35 AM IST

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తర్వాత అంతటి ఫామ్​లో ఉన్న బ్యాట్స్​మన్​గా రోహిత్ శర్మ కనిపిస్తున్నాడు. గతేడాది వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఘనత సాధించిన క్రికెటర్​గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అరుదైన రికార్డులకు అడుగు దూరంలో ఉన్నాడు. రోహిత్ శర్మ వాటిని ఈ ఏడాదే అధిగమించే అవకాశముంది. అవేంటో ఇప్పుడు చూద్దామా.

అత్యధిక టీ20 మ్యాచ్​లు

రోహిత్ శర్మ.. అత్యధిక అంతర్జాతీయ టీ20 మ్యాచ్​లు ఆడిన క్రికెటర్లలో ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్నాడు. అతడి కంటే ముందు పాక్ ఆటగాడు షోయబ్ మాలిక్(111 మ్యాచ్​లు) అగ్రస్థానంలో ఉన్నాడు. 104 టీ20లు ఆడిన హిట్ మ్యాన్​.. మాలిక్ రికార్డును అందుకునేందుకు ఇంకో ఏడు మ్యాచ్​లు ఆడితే సరిపోతుంది.

indian cricketer rohit sharma
భారత క్రికెటర్ రోహిత్​శర్మ

ఈ ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్ ముందు టీమిండియా 17 టీ20 మ్యాచ్​లు ఆడనున్న నేపథ్యంలో గాయాల బారిన పడకుండా ఇదే ఫామ్​లో ఉంటే రోహిత్​కు మాలిక్ రికార్డు అందుకోవడం పెద్ద కష్టమేమి కాదు. ప్రస్తుతం శ్రీలంకతో టీ20 సిరీస్​కు విశ్రాంతి తీసుకున్నాడు.

టీ20 ప్రపంచకప్​లో అత్యధిక సిక్సర్లు

స్ట్రోక్ ప్లేయర్​గా రోహిత్ శర్మకు మంచి గుర్తింపు ఉంది. పుల్ షాట్లతో బౌలర్లకు చుక్కలు చూపిస్తూ, సులభంగా సిక్సర్లు బాదేస్తాడు. టీ20 ప్రపంచకప్​లో అత్యధిక సిక్సర్ల రికార్డుకు అడుగు దూరంలో ఉన్నాడు హిట్​ మ్యాన్.

indian cricketer rohit sharma
భారత క్రికెటర్ రోహిత్​శర్మ

పొట్టి ప్రపంచకప్​లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డు భారత మాజీ బ్యాట్స్​మన్​ యువరాజ్ సింగ్ పేరిట ఉంది. 31 మ్యాచ్​ల్లో 33 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉన్నాడు యువీ. రోహిత్.. 28 మ్యాచ్​ల్లో 24 సిక్సర్లతో తర్వాతి స్థానంలో ఉన్నాడు. ఇదే ఫామ్​ కొనసాగిస్తే ఈ ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్​లో హిట్ మ్యాన్..​ ఆ ఘనత సాధించే అవకాశముందని అభిమానులు ఆశిస్తున్నారు. మరో పది సిక్సర్లు బాదితే ఈ ఏడాదే యువీ రికార్డును అధిగమిస్తాడు రోహిత్.

ఒక జట్టుపై 100 సిక్సర్లు

జట్టు ఏదైనా అదే జోరు కొనసాగిస్తూ.. అలవోకగా బౌండరీలు కొడుతుంటాడు రోహిత్. దాదాపు అన్ని జట్లపైనా సిక్సర్లతో విరుచుకుపడిన ఈ బ్యాట్స్​మన్​.. అత్యధికంగా ఆస్ట్రేలియాపై కొట్టాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 61 మ్యాచ్​ల్లో 93 సిక్సర్లు బాది వందకు చేరువలో ఉన్నాడు.

indian cricketer rohit sharma
భారత క్రికెటర్ రోహిత్​శర్మ

ఈ నెల 14న ఆసీస్​తో జరగనున్న వన్డే సిరీస్ నుంచి 2021 జనవరి వరకు మూడు ఫార్మాట్లలో కలిపి 18 ఇన్నింగ్స్​లు(3 వన్డేలు, 3టీ20లు, 6 టెస్టు ఇన్నింగ్స్​లు) ఆడనుంది టీమిండియా. కాబట్టి అతడు ఈ ఏడాదే ఈ రికార్డూ బద్దలు కొట్టే అవకాశముంది. ఓ జట్టుపై 100 లేదా అంతకంటే ఎక్కువ సిక్సర్లు కొట్టిన ఘనత విండీస్ వీరుడు క్రిస్ గేల్ పేరిట ఉంది. ఇంగ్లాండ్​పై అతడు 69 మ్యాచ్​ల్లో 139 సిక్సర్లతో మొదటి స్థానంలో ఉన్నాడు.

AP Video Delivery Log - 1500 GMT News
Tuesday, 7 January, 2020
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1451: US White House OBrien AP Clients Only 4248072
White House: 'Strong evidence' led to drone strike
AP-APTN-1448: Bosnia Soleimani Iran AP Clients Only 4248071
Bosnians pay respects at Iran embassy in Sarajevo
AP-APTN-1436: Chile Australia Smoke AP Clients Only 4248070
Chile confirms arrival of Australia wildfire smoke
AP-APTN-1427: US NY Weinstein Arrival AP Clients Only 4248068
Weinstein arrives in court for jury selection
AP-APTN-1410: Belgium EU FMs AP Clients Only 4248055
FMs meet in Brussels to discuss Iran
AP-APTN-1401: Iraq al Muhandis AP Clients Only 4248063
Mourners gather in Basra for al Muhandis farewell
AP-APTN-1345: France Attacks Ceremonies AP Clients Only 4248060
France marks Charlie Hebdo attack anniversary
AP-APTN-1339: Lebanon Japan AP Clients Only 4248058
Aoun meets Japanese ambassador over Ghosn
AP-APTN-1326: Puerto Rico Earthquake Damage 2 No access Puerto Rico 4248054
Heavy seismic activity collapses PRican buildings
AP-APTN-1310: Puerto Rico Earthquake Damage No access Puerto Rico 4248050
Quake damages buildings in Puerto Rico
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.