టీమ్‌ఇండియాకు చెందిన ఐదుగురు క్రికెటర్లను ఐసోలేషన్‌కు పంపించారు. మెల్‌బోర్న్‌లోని ఓ హోటల్లో కలిసి భోజనం చేయడం వల్ల ఇతర క్రికెటర్లతో వారిని దూరంగా ఉంచినట్టు తెలిసింది. పైగా వారు బయోబుడగ నిబంధనలు ఉల్లంఘించారో లేదో అనే విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా, బీసీసీఐ సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం.
నూతన సంవత్సరం సందర్భంగా రోహిత్ శర్మ, రిషభ్ పంత్, శుభ్‌మన్ గిల్, పృథ్వీషా, నవదీప్ సైని మెల్‌బోర్న్‌లోని ఓ హోటల్‌కు వెళ్లి భోజనం చేశారు. అక్కడే ఉన్న భారత అభిమాని ఒకరు వీరి చిత్రాలు, వీడియోలను తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. వారి బిల్లు కట్టడమే కాకుండా పంత్‌ను కౌగిలించుకున్నానని వ్యాఖ్యానించాడు. ఇది వివాదాస్పదం కావడం వల్ల ఆ అభిమాని క్షమాపణలు కోరాడు. తన డబ్బులను రోహిత్ శర్మ చెల్లించాడని తెలిపాడు.
'ఐదుగురు ఆటగాళ్లను భారత్, ఆస్ట్రేలియా జట్ల నుంచి వేరు చేశాం. అయితే కొవిడ్-19 నిబంధనలను అనుసరించి వారు సాధన చేస్తారు. భారత, ఆసీస్ జట్లలోని మిగతా ఆటగాళ్ల భద్రతను దృష్టిలో పెట్టుకొనే ఇలా చేశాం' అని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. 'వారు బయటకు వెళ్లినప్పుడు బయోబుడగ నిబంధనల ఉల్లంఘన జరిగిందో లేదో తెలుసుకునేందుకు బీసీసీఐ, సీఏ దర్యాప్తు చేపట్టాయి. టెస్టు సిరీసు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొనే ఐదుగురిని విడదీశాం' అని వెల్లడించింది.
-
Bc mere saamne waale table par gill pant sharma saini fuckkkkkk pic.twitter.com/yQUvdu3shF
— Navaldeep Singh (@NavalGeekSingh) January 1, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Bc mere saamne waale table par gill pant sharma saini fuckkkkkk pic.twitter.com/yQUvdu3shF
— Navaldeep Singh (@NavalGeekSingh) January 1, 2021Bc mere saamne waale table par gill pant sharma saini fuckkkkkk pic.twitter.com/yQUvdu3shF
— Navaldeep Singh (@NavalGeekSingh) January 1, 2021
ప్రస్తుతం బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భారత్, ఆస్ట్రేలియా చెరో మ్యాచ్ గెలిచాయి. సిరీసు 1-1తో సమం కావడం వల్ల సిడ్నీలో జరిగే మూడో టెస్టుపై అందరి దృష్టి నెలకొంది.
ఇదీ చూడండి : భారత క్రికెటర్ల హోటల్ బిల్ కట్టిన అభిమాని