ETV Bharat / sports

ఆసీస్​తో టెస్టు సిరీస్​కు రోహిత్​, ఇషాంత్​ కష్టమే!

ప్రస్తుతం ఎన్​సీఏ శిబిరంలో ఉన్న రోహిత్​శర్మ, ఇషాంత్​ శర్మ.. మరో నాలుగు రోజుల్లో ఆస్ట్రేలియా పర్యటనకు బయలుదేరకపోతే వారు టెస్ట్​ సిరీస్​ ఆడటం కష్టమేనన్నాడు టీమ్​ఇండియా ప్రధాన కోచ్​ రవిశాస్త్రి.

Rohit, Ishant
రోహిత్​, ఇషాంత్
author img

By

Published : Nov 22, 2020, 9:42 PM IST

Updated : Nov 22, 2020, 10:01 PM IST

ఆస్ట్రేలియా పర్యటనలో ​రోహిత్​ శర్మ, ఇషాంత్​ శర్మ పాల్గొంటారా లేదా అనే విషయమై ఆందోళన వ్యక్తం చేశాడు టీమ్​ఇండియా హెడ్​ కోచ్​ రవిశాస్త్రి. మరో మూడు లేదా నాలుగు రోజుల్లో వారు భారత్​ నుంచి బయలుదేరితేనే ఆసీస్​తో జరిగే టెస్టు సిరీస్​లో పాల్గొనడానికి అవకాశముంటుందని చెప్పాడు. లేదంటే వారు ఆడటం ఇక కష్టమేనని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం ఎన్​సీఏకు చెందిన వైద్యబృందం వారిని పర్యవేక్షిస్తూ.. ఇంకా ఎంత కాలం విశాంత్రి అవసరమో అంచనా వేస్తోందని తెలిపాడు.

ఐపీఎల్​లో గాయపడ్డ రోహిత్​, ఇషాంత్​.. ప్రస్తుతం బెంగళూరులోని ఎన్​సీఏలో పునరావాసానికి వెళ్లారు. అక్కడ పూర్తిస్థాయి ఫిట్​నెస్​ సాధిస్తేనే ఆసీస్​తో జరిగే టెస్ట్​ సిరీస్​లో ఆడటానికి అర్హత సాధిస్తారు. అయితే వారు ప్రాక్టీస్​ చేస్తోన్న వీడియోలను బీసీసీఐ పోస్ట్​ చేస్తుంది తప్ప.. వారి పర్యటన గురించి ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు. ఆస్ట్రేలియా నిబంధనల ప్రకారం సిరీస్​లో పాల్గొనే ఆటగాళ్లు అక్కడికి చేరుకోగానే 14రోజుల పాటు క్వారంటైన్​లో ఉండాలి. అడిలైడ్​ వేదికగా డిసెంబర్‌ 17 నుంచి తొలి టెస్ట్​ ప్రారంభంకానుంది. కాబట్టి వారు త్వరగా కోలుకోని అక్కడికి చేరుకోగానే నిర్బంధంలోకి వెళ్లాల్సి ఉంటుంది. అప్పుడే ఇరువురూ టెస్ట్​ సిరీస్​కు హాజరుకాగలరు. కానీ ఇప్పటివరకు వారి ఆరోగ్యపరిస్థితిపై ఎటువంటి స్పష్టత లేకపోవడం వల్ల రవిశాస్త్రి పైవ్యాఖ్యలు చేశాడు.

అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రోహిత్​.. తాను టెస్టు సిరీస్​లో ఆడుతానని ధీమా వ్యక్తం చేశాడు. ప్రస్తుతం గాయం నుంచి తాను కోలుకుంటున్నట్లు తెలిపాడు. నవంబరు 17 నుంచి జనవరి 19వరకు జరగనున్న పర్యటనలో ఇరు జట్లు మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు ఆడనున్నాయి.

కోహ్లీ నిర్ణయం సరైనదే

ఆసీస్​-భారత్​కు మధ్య జరిగే టెస్టు సిరీస్ సమయంలో ​ సారథి కోహ్లీ భార్య బిడ్డకు జన్మనివ్వనుంది. ఇందుకోసం విరాట్​.. టెస్ట్​ సిరీస్​లోని చివరి మూడు మ్యాచ్​లు ఆడకుండా పితృత్వ సెలవుల తీసుకుని స్వదేశానికి రానున్నాడు. దీనిపై స్పందించిన రవిశాస్త్రి.."కోహ్లీ సరైన నిర్ణయమే తీసుకున్నాడు. ఆ క్షణాలు మళ్లీ మళ్లీ తిరిగి వచ్చేవి కాదు. అతడు తన భార్య వద్దకు వెళ్తున్నందుకు నేను సంతోషంగా ఉన్నాను. గత ఆరేళ్ల నుంచి టీమ్​ఇండియా విజయాలలో విరాట్​ కీలక పాత్ర పోషించాడు. కాబట్టి అతడు దూరమవ్వడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది. కానీ విరాట్​ స్థానంలో మరో ఆటగాడికి అవకాశం లభిస్తుంది" అని అన్నాడు.

ఇదీ చూడండి : కోలుకుంటున్నా.. ఆసీస్​తో టెస్టులు​​ ఆడతా: రోహిత్

Last Updated : Nov 22, 2020, 10:01 PM IST

For All Latest Updates

TAGGED:

Rohit
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.