ETV Bharat / sports

సెహ్వాగ్​ 35 బంతుల్లో 80- ఇండియా లెజెండ్స్​ విజయం - భారత్​

కరోనా అనంతరం.. తిరిగి ప్రారంభమైన రోడ్​ సేఫ్టీ వరల్డ్​ సిరీస్​ ఐదో మ్యాచ్​లో ఇండియా లెజెండ్స్​ జట్టు గెలుపొందింది. 10 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్​ను చిత్తుగా ఓడించింది. సెహ్వాగ్​ 35 బంతుల్లో 80, సచిన్​ 33 పరుగులతో అదరగొట్టారు.

India Legends won by 10 wkts
సెహ్వాగ్​ 35 బంతుల్లో 80- ఇండియా లెజెండ్స్​ విజయం
author img

By

Published : Mar 5, 2021, 9:46 PM IST

రోడ్​ సేఫ్టీ వరల్డ్​ సిరీస్​లో ఇండియా లెెజెండ్స్​ విజయం సాధించింది. భారత బ్యాటింగ్​ దిగ్గజం సచిన్​ తెందుల్కర్​ సేన.. 10 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్​ లెజెండ్స్​ టీంను చిత్తుగా ఓడించింది.

ఓపెనర్లే ముగించేశారు..​

110 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా లెజెండ్స్​ 10.1 ఓవర్లలోనే వికెట్లు కోల్పోకుండా గెలిచింది. విధ్వంసకర ఓపెనర్​ సెహ్వాగ్​ 35 బంతుల్లోనే 80 పరుగులు చేశాడు. ఇందులో 10 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. ఒకప్పటి తన దూకుడైన ఆట తీరును గుర్తుచేశాడు. మరో ఓపెనర్​ సచిన్​ 26 బంతుల్లో 33 పరుగులతో అజేయంగా నిలిచాడు.

తొలుత బ్యాటింగ్​ చేసిన బంగ్లాదేశ్​ జట్టు.. 19.4 ఓవర్లలో 109 పరుగులకు ఆలౌట్​ అయింది.

ఓపెనర్​ నజీముద్దిన్(49) టాప్​ స్కోరర్​. భారత బౌలర్లలో వినయ్​ కుమార్​, ప్రజ్ఞాన్​ ఓజా, యువరాజ్​ సింగ్​ తలో రెండు వికెట్లు తీశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.