ETV Bharat / sports

రోడ్​ సేఫ్టీ సిరీస్​: విండీస్​పై గెలిచి ఫైనల్​కు భారత్​ - road safety series match

రోడ్​ సేఫ్టీ సిరీస్ సెమీ ఫైనల్లో ఇండియా లెజెండ్స్ విజయం సాధించింది. విండీస్​ లెజెండ్స్​పై 12 పరుగుల తేడాతో సచిన్ సేన గెలుపొందింది. భారత లెజెండ్స్​ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేయగా.. లారా సేన 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 206 పరుగులకు పరిమితమైంది.

road safety series
రోడ్​ సేఫ్టీ సిరీస్​: సెమీస్​లో విండీస్​పై భారత్ విజయం
author img

By

Published : Mar 17, 2021, 11:04 PM IST

Updated : Mar 18, 2021, 12:25 AM IST

రోడ్​ సేఫ్టీ సిరీస్ సెమీఫైనల్లో ఇండియా లెజెండ్స్ విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్​లో విండీస్​ లెజెండ్స్​పై భారత బ్యాటింగ్​ దిగ్గజం సచిన్​ తెందుల్కర్​ సేన.. 12 పరుగుల తేడాతో గెలుపొందింది. ఫలితంగా ఫైనల్​కు చేరింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత లెజెండ్స్ జట్టు​ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. అయితే 219 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లారా సేన 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 206 పరుగులకు పరిమితమైంది.

సచిన్​ తెందుల్కర్​ (42 బంతుల్లో 65) అర్ధ సెంచరీతో ఆకట్టుకోగా.. సెహ్వాగ్ (17 బంతుల్లో 35), యూసుఫ్ పఠాన్ (20 బంతుల్లో 37*), యువరాజ్​ (20 బంతుల్లో 49*​) విధ్వంసం సృష్టించారు. బ్యాటింగ్ చేసిన ప్రతి భారత ఆటగాడు మెరుగైన ప్రదర్శన చేశారు. విండీస్ బౌలర్లలో టినో బెస్ట్​ 2 వికెట్లు తీసుకున్నాడు.

219 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లారా సేన 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 206 పరుగులకే పరిమితమైంది. డ్వేన్ స్మిత్ (36 బంతుల్లో 63), డియో నరైన్ (44 బంతుల్లో 59) పరుగులతో రాణించినప్పటికీ విండీస్​కు ఓటమి తప్పలేదు.

భారత బౌలర్లలో వినయ్​ కుమార్​ రెండు వికెట్లు తీయగా.. ప్రజ్ఞాన్​ ఓజా, ఇర్ఫాన్​ తలో వికెట్ తీశారు.

Last Updated : Mar 18, 2021, 12:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.