ETV Bharat / sports

ఇర్ఫాన్​, గోనీ పోరాటం వృథా.. భారత్​కు తొలి​ ఓటమి

రోడ్​ సేఫ్టీ సిరీస్​లో భాగంగా జరిగిన మ్యాచ్​లో.. ఇంగ్లాండ్​ లెజెండ్స్​ చేతిలో ఇండియా లెజెండ్స్​ జట్టు 6 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్​ చేసిన ఇంగ్లాండ్​ నిర్ణీత ఓవర్లలో 188 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్​కు దిగిన భారత్​.. ఛేదనలో తడబాటుకు గురైంది.

road safety series england won the match
ఇర్ఫాన్​, గోనీ పోరాటం వృథా.. భారత్​కు తొలి​ ఓటమి
author img

By

Published : Mar 10, 2021, 7:04 AM IST

రోడ్‌ సేఫ్టీ ప్రపంచ సిరీస్‌ టీ20 టోర్నీలో భారత్‌ లెజెండ్స్‌ జట్టుకు తొలి ఓటమి ఎదురైంది. ‌ఇండియా లెజెండ్స్​ జట్టు 6 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ లెజెండ్స్‌ చేతిలో ఓడింది. మొదట బ్యాటింగ్​ చేసిన ఇంగ్లాండ్‌ 20 ఓవర్లలో 188/7 స్కోరు చేసింది. కెప్టెన్‌ పీటర్సన్‌ (75) టాప్‌స్కోరర్‌. ఛేదనలో భారత జట్టు తడబడింది. సచిన్‌ (9), సెహ్వాగ్‌ (6), కైఫ్‌ (1), యువరాజ్‌ (22), బద్రినాథ్‌ (8), యూసుఫ్‌ (17) విఫలం కావడంతో 99కే 6 వికెట్లు కోల్పోయింది.

ఈ స్థితిలో ఇర్ఫాన్‌ పఠాన్​ (61 నాటౌట్‌; 34 బంతుల్లో 4×4, 5×6), మన్‌ప్రీత్‌ గోనీ (35 నాటౌట్‌; 16 బంతుల్లో 1×4, 4×6)తో కలిసి ఎదురుదాడి చేశారు. దీంతో భారత జట్టులో గెలుపు ఆశలు చిగురించాయి. కానీ చివరి ఓవర్లో 19 పరుగులు చేయాల్సిన స్థితిలో 12 పరుగులే వచ్చాయి. నిర్ణీత ఓవర్లలో భారత్‌ 7 వికెట్లకు 182 పరుగులే చేసింది. ఇంగ్లాండ్​ బౌలర్లలో పనేసర్‌ (3/15), ట్రెడ్‌వెల్‌ (2/44) రాణించారు.

ఇదీ చదవండి: టోక్యో ఒలింపిక్స్​: విదేశీ క్రీడాభిమానులకు నో ఎంట్రీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.