భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందూల్కర్‌ను ఔట్ చేసినందుకు చంపేస్తామంటూ బెదరింపులు వచ్చాయని తెలిపాడు ఇంగ్లాండ్ పేసర్ టిమ్ బ్రెస్నన్.
2011 వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో చేసిన సెంచరీతో 99 శతకాలు పూర్తి చేసుకున్నాడు సచిన్. అనంతరం అదే ఏడాది ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ జరిగింది. అందులో ఓవల్ వేదికగా జరిగిన నాలుగో మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో 91 పరుగుల వద్ద సచిన్‌ను ఎల్బీడబ్ల్యూ చేశాడు టిమ్ బ్రెస్నన్. దీంతో మాస్టర్‌కు తన వందో సెంచరీ పూర్తి చేసుకునే అవకాశం చేజారిపోయింది. ఫలితంగా అభిమానులు నిరాశకు గురయ్యారు.
ఆ తర్వాత "నిన్ను చంపేస్తాం" అంటూ చాలామంది ట్విట్టర్లో బెదరించడం ప్రారంభించారని చెప్పాడు బ్రెస్నన్. సచిన్‌ను ఔట్ ఇవ్వడానికి ఎంత ధైర్యం అంటూ అంపైర్ రాడ్ టక్కర్‌ను ప్రశ్నించారని తెలిపాడు.
"కొన్నిరోజుల తర్వాత అంపైర్ టక్కర్‌ను కలిశాను. అప్పటికే బెదరింపులు రావడం వల్ల ఆయన కూడా నాలాగా సెక్యూరిటి గార్డు, పోలీసుల బందోబస్తు నియమించుకున్నాడు."
-బ్రెస్నన్, ఇంగ్లాండ్ పేసర్
అనంతరం 2012 ఆసియా కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో శతకం బాది తన వందో సెంచరీ పూర్తి చేసుకున్నాడు సచిన్. 2013లో క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మాస్టర్.. కెరీర్లో టెస్టుల్లో 15,921, వన్డేల్లో 18,426 పరుగులు చేశాడు.
ఇది జరిగింది : క్రికెట్ X కరోనా : పోరులో గెలిచేదెవరు?