ETV Bharat / sports

పాకిస్థాన్​ సూపర్​ లీగ్‌లో ఆడనున్న ఆర్సీబీ పేసర్‌

పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌(పీఎస్‌ఎల్‌)లో ఆడేందుకు దక్షిణాఫ్రికా పేసర్​, ఆర్సీబీ జట్టు సభ్యుడు డేల్​ స్టెయిన్​ సిద్ధమవుతున్నాడు. దాయాది దేశంలో ఆడేందుకు ఎంతో ఉత్సాహంగా ఉన్నట్లు ట్విట్టర్​ వేదికగా వెల్లడించాడు.

author img

By

Published : Feb 17, 2020, 10:21 AM IST

Updated : Mar 1, 2020, 2:30 PM IST

RCB pacer Dale Steyn will play for Islamabad United in Pakistan Super League 2020
పాకిస్థాన్​ సూపర్​ లీగ్‌లో ఆడనున్న ఆర్సీబీ పేసర్‌

పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌(పీఎస్‌ఎల్‌)లో ఆడడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నానని అభిప్రాయపడ్డాడు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరు ఆటగాడు, దక్షిణాఫ్రికా పేస్ దళపతి డేల్‌ స్టెయిన్‌. ఈ విషయాన్నిఆదివారం ట్విట్టర్​ వేదికగా వెల్లడించాడు. ఈ లీగ్​లో రెండుసార్లు ఛాంపియన్‌ అయిన ఇస్లామాబాద్‌ యునైటెడ్‌ తరఫున స్టెయిన్‌ ఆడనున్నాడు.

RCB pacer Dale Steyn will play for Islamabad United in Pakistan Super League 2020
డేల్​ స్టెయిన్​

"పాకిస్థాన్‌లోని అందరికి హలో! మీకో చిన్న కబురు చెప్పడానికి వచ్చాను. పీఎస్‌ఎల్​ ఇస్లామాబాద్‌ యునైటెడ్‌ తరఫున ఆడడానికి ఎంతో ఆసక్తిగా ఉన్నా. మీరంతా వచ్చి మా ఆటను ఆస్వాదించండి. ఈ టోర్నీ కోసం ఎంతో ఎదురుచూస్తున్నా. మీ అందర్నీ అక్కడ కలుస్తా"

-- డేల్​ స్టెయిన్​, దక్షిణాఫ్రికా పేసర్​

టోర్నీలోని అన్ని మ్యాచ్​లు పాకిస్థాన్‌లోనే నిర్వహిస్తుండటం ఇదే తొలిసారి. కరాచీ, లాహోర్‌, ముల్తాన్‌, రావల్పిండి నగరాలు మ్యాచ్​లకు ఆతిథ్యమివ్వనున్నాయి. ఫిబ్రవరి 20 నుంచి మార్చి 22 వరకు జరిగే ఈ లీగ్‌లో.. స్టెయిన్‌ ఎన్ని మ్యాచ్‌లు ఆడతాడనేదానిపై స్పష్టత లేదు. తాజాగా ఇంగ్లాండ్​తో టీ20 సిరీస్​లో ఆడిన ఇతడు.. త్వరలో ఆస్ట్రేలియా, భారత్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లూ ఆడనున్నాడు. ఈ మ్యాచ్​లు కూడా పీఎస్‌ఎల్‌ జరిగే సమయంలో ఉండడం గమనార్హం.

Last Updated : Mar 1, 2020, 2:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.