ఐపీఎల్ 13వ సీజన్లో ఓవర్‌నైట్ స్టార్ అయిపోయిన ఆటగాడు రాజస్థాన్ రాయల్స్ ఆల్‌రౌండర్ రాహుల్ తెవాతియా. ఇప్పుడు అతడు త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. గురువారం అత్యంత సన్నిహితులు, కుటుంబసభ్యుల సమక్షంలో నిశితార్థం చేసుకున్నాడు. అందుకు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాలో అభిమానులతో పంచుకున్నాడు. ఇది చూసిన నెటిజన్లు సామాజిక మాధ్యమాల వేదికగా అతడికి ఆశ్వీరాదాలు అందిస్తున్నారు. ఈ వేడుకకు క్రికెటర్స్ నితీశ్ రానా, జయంత్ యాదవ్ హాజరయ్యారు. అయితే ఈ ఆల్‌రౌండర్‌ను వివాహమాడబోయే అమ్మాయి వివరాలు ఇంకా తెలియలేదు.

ఐపీఎల్ 13వ సీజన్లో పంజాబ్‌తో జరిగిన ఓ మ్యాచ్‌లో తన అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఐదు సిక్స్‌లు బాది అంతా తన గురించి మాట్లాడుకునేలా చేశాడు తెవాతియా. ఆ మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. మొత్తంగా 11 ఇన్నింగ్స్‌లో 255 పరుగులతో పాటు 10 వికెట్లు తీసి అదరగొట్టాడు.


ఇదీ చూడండి : ఓ ఇంటివాడైన మరో టీమ్ఇండియా క్రికెటర్