ETV Bharat / sports

శతకంతో ఆత్మవిశ్వాసం రెట్టింపు: పంత్

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో ప్రాక్టీస్​ మ్యాచ్​లో సెంచరీ సాధించడం వల్ల తనలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యిందని అన్నాడు టీమ్​ఇండియా బ్యాట్స్​మన్ పంత్​. ఈ పోరులో తమ జట్టు ఆటగాళ్లందరూ బాగా ఆడారని కొనియాడాడు.

Pant
పంత్​
author img

By

Published : Dec 14, 2020, 12:30 PM IST

ఆస్ట్రేలియా-ఎతో జరిగిన రెండో సన్నాహక మ్యాచ్‌లో పంత్‌ మెరుపు శతకం బాది అందరి దృష్టినీ ఆకర్షించాడు. విమర్శించిన నోళ్ల చేతే ప్రశంసలు అందుకున్నాడు. అయితే ఈ సెంచరీ సాధించడం వల్ల తనలో ఆత్మవిశ్వాసం బాగా పెరిగిందన్నాడు పంత్​.

Pant
పంత్​

"చాలా ఓవర్లు మిగిలున్న సమయంలో బ్యాటింగ్​కు దిగాను. అందువల్ల విహారి, నేను మంచి భాగస్వామ్యం నెలకొల్పాలని అనుకున్నాం. వీలైనంతగా పరుగులు రాబట్టాలని చూశాం. అలానే నాలో ఆత్వవిశ్వాసాన్ని పెంచుకునేందుకు ఎక్కువ సమయం బ్యాటింగ్ చేయాలనుకున్నా. మొత్తంగా నేను సాధించిన శతకం నాకు మరింత బలాన్ని ఇచ్చింది. నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. నెల రోజుల నుంచి ఆస్ట్రేలియాలో ఉన్నప్పటికీ తొలి ప్రాక్టీస్​ మ్యాచులో ఆడే అవకాశం దక్కలేదు. తొలి ఇన్నింగ్స్​లో అంపైర్​ తప్పిదం (ఎల్​బీడబ్ల్యూ)నా దురదృష్టం. అందుకే రెండో ఇన్నింగ్స్​లో వీలైనంత బాగా ఆడటానికి ప్రయత్నించా."

-పంత్​, టీమ్​ఇండియా ఆటగాడు.

తుది జట్టులో పంత్​

రెండో సన్నాహక మ్యాచులో శతకంతో విమర్శకులకు సమాధానం చెప్పిన పంత్‌ టెస్టు తుది జట్టులో స్థానం దక్కించుకోవడం ఖాయంగా అనిపిస్తోంది. అంతేగాక తొలి రోజు ఆటలో మరో వికెట్‌కీపర్ సాహా ఫీల్డింగ్‌ చేయగా పంత్ వికెట్‌కీపింగ్ చేశాడు. దీంతో సాహాకు బదులుగా పంత్‌ జట్టులోకి వస్తాడని వార్తలు వస్తున్నాయి. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్‌ కావడం పంత్‌కు కలిసొచ్చే అంశం. టీమ్​ఇండియా టెస్టు జట్టులో జడేజా, పంత్ మినహా ఎవరూ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్‌ లేరు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.