ETV Bharat / sports

క్రికెట్​ ఆడాలంటే అంత వయసు ఉండాల్సిందే - హసన్​ రాజా

అంతర్జాతీయ క్రికెటర్లకు కనీస వయోపరిమితిని ఐసీసీ ప్రవేశపెట్టింది. అన్ని ప్రపంచస్థాయి టోర్నీల్లో పాల్గొనడానికి ఆటగాళ్లకు కనీసం 15 ఏళ్లు నిండాలని తెలిపింది.

Player must be 15-year-old to play international cricket, says ICC
అంతర్జాతీయ క్రికెట్​లో 15 ఏళ్ల కనీస వయోపరిమితి
author img

By

Published : Nov 20, 2020, 10:46 AM IST

ఇకపై అంతర్జాతీయ క్రికెట్​ ఆడాలంటే కనీసం 15 ఏళ్లు ఉండాల్సిందే. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ మండలి నిర్ణయం తీసుకుంది. ఐసీసీ ఈవెంట్లు, ద్వైపాక్షిక సిరీస్​ల్లో ఆడే ప్రతి ఆటగాడికి 15 ఏళ్లు దాటి ఉండాలని ఓ ప్రకటనలో తెలియజేసింది.

"ఐసీసీ ఈవెంట్స్​, ద్వైపాక్షిక క్రికెట్​, అండర్​-19 టోర్నీలతో సహా క్రికెట్​కు సంబంధించిన అన్ని మ్యాచ్​ల్లో ఆటగాళ్లకు కనీస వయోపరిమితులను ప్రవేశపెట్టేందుకు బోర్డు ధ్రువీకరించింది. పురుషుల, మహిళల లేదా అండర్​-19 స్థాయిలో ఆడే ప్రతి క్రికెటర్​ తప్పకుండా 15 ఏళ్లు నిండి ఉండాలి. ఒకవేళ అంతకంటే తక్కువ ఉంటే జాతీయ జట్టులో ఆడించేందుకు ఆ దేశ బోర్డు తప్పనిసరిగా ఐసీసీ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది"

- అంతర్జాతీయ క్రికెట్​ మండలి (ఐసీసీ)

ఇంతకు ముందు వరకు అంతర్జాతీయ క్రికెట్​లో కనీస వయోపరిమితి లేదు. 1996 నుంచి 2005 మధ్య పాకిస్థాన్​ జట్టు తరపున 7 టెస్టులు, 16 వన్డేలు ఆడిన హసన్​ రాజా అంతర్జాతీయ క్రికెట్​లో అతిపిన్న వయస్కుడిగా రికార్డు సాధించాడు. 14 సంవత్సరాల 227 రోజుల వయసులోనే టెస్టుల్లో అరంగేట్రం చేశాడు.

దిగ్గజ బ్యాట్స్​మన్​ సచిన్​ తెందుల్కర్​ టీమ్​ఇండియా తరపున చిన్న వయసులోనే టెస్టు క్రికెట్​లో అడుగుపెట్టాడు. 16 ఏళ్ల 205 రోజుల వయసులో అరంగేట్రం చేశాడు. సచిన్​ టెస్టుల్లో 15,921, వన్డేల్లో 18,426 పరుగులు చేశాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.