ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న టీమ్ఇండియా ఆటగాళ్లకు తృటిలో ప్రమాదం తప్పింది. ప్రస్తుతం వారు సిడ్నీలో క్వారంటైన్లో ఉన్న ప్రదేశానికి 30కిలోమీటర్ల దూరంలోని ఓ మైదానంలో విమానం కూలింది. శనివారం ఈ ఘటన చోటు చేసుకున్నట్లు అక్కడి మీడియా తెలిపింది.
విమానం కూలిన సమయంలో ఆ మైదానంలో స్థానిక క్రికెటర్లు, ఫుట్బాల్ ఆటగాళ్లు మ్యాచ్లు ఆడుతున్నారు. అదృష్టం కొద్దీ వారికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. విమానంలో ఉన్న ఇద్దరు మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
నవంబర్ 27 నుంచి జనవరి 19 వరకు జరిగే ఈ పర్యటనలో భాగంగా ఆసీస్-భారత్ మధ్య మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు జరగనున్నాయి.
ఇదీ చూడండి :