ETV Bharat / sports

గులాబి టెస్టు: భారీ ఆధిక్యంతో భారత్​ ఇన్నింగ్స్​ డిక్లేర్​

author img

By

Published : Nov 23, 2019, 5:39 PM IST

Updated : Nov 23, 2019, 5:55 PM IST

కోల్​కతాలోని ఈడెన్​గార్డెన్​ వేదికగా జరుగుతున్న చారిత్రక డే/నైట్​ టెస్టు తొలి ఇన్నింగ్స్​లో టీమిండియా భారీ ఆధిక్యం సాధించింది. 241 పరుగుల ఆధిక్యం వద్ద ఇన్నింగ్స్​ డిక్లేర్​ చేసింది. కెప్టెన్​ కోహ్లీ కెరీర్​లో మరో శతకం సాధించాడు.

గులాబి టెస్టు: భారీ ఆధిక్యంతో భారత్​ ఇన్నింగ్స్​ డిక్లేర్​

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న డేనైట్‌ టెస్టులో.. 241 పరుగుల ఆధిక్యంలో తొలి ఇన్నింగ్స్​ను డిక్లేర్​ చేసింది టీమిండియా. ఓవర్​నైట్​ స్కోరు 174/3తో రెండో రోజు(శనివారం) బరిలోకి దిగిన భారత జట్టు.. 9 వికెట్ల నష్టానికి 347 పరుగులు చేసింది.

విరాట్​ జోరు...

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(136; 194 బంతుల్లో, 12 ఫోర్లు) శతకం బాదాడు. టెస్టుల్లో 27 శతకం పూర్తి చేసుకున్నాడు. పుజారా (55: 105 బంతుల్లో, 8 ఫోర్లు), వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానె(51; 69 బంతుల్లో 7ఫోర్లు) రాణించాడు. మిగతా ఆటగాళ్లలో జడేజా(12), సాహ(17*), అశ్విన్​(9), ఉమేశ్​ యాదవ్​(0), ఇషాంత్​(0), షమీ(0*) పరుగులు చేశారు.

బంగ్లా బౌలర్లలో అల్​అమిన్​ హొస్సేన్​, ఎబాదత్​ హొస్సేన్​ తలో మూడు వికెట్లు తీసుకున్నారు. అబు జాయెద్​ 2, తైజు ఇస్లాం 1 వికెట్​ ఖాతాలో వేసుకున్నారు.

శుక్రవారం బంగ్లా తొలి ఇన్నింగ్స్‌లో 106 పరుగులకు ఆలౌట్‌ కాగా, టీమిండియా మూడు వికెట్లకు 174 పరుగులు చేసింది.

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Nov 23, 2019, 5:55 PM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.