ETV Bharat / sports

బుమ్రా నంబర్.1 అవుతాడని ముందే చెప్పిన యువీ - బుమ్రా గురించి చెప్పిన యువీ

ఇన్​స్టా లైవ్​లో తాజాగా యువీతో చర్చించిన బుమ్రా.. తన బౌలింగ్ యాక్షన్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. అప్పట్లో తన బౌలింగ్ చూసి చాలా మంది పెదవి విరిచినట్లు చెప్పుకొచ్చాడు.

'నేను ఎక్కువ కాలం బౌలింగ్ చేయనని అన్నారు'
టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా
author img

By

Published : Apr 27, 2020, 12:18 PM IST

ప్రస్తుతం వన్డేల్లో టాప్-2 బౌలర్​గా కొనసాగుతున్న టీమిండియా క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రా.. పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. కెరీర్ ప్రారంభంలో తన బౌలింగ్ యాక్షన్ చూసిన చాలా మంది.. క్రికెట్లో ఎక్కువ కాలం కొనసాగలేనని చెప్పినట్లు తెలిపాడు. తాజాగా భారత మాజీ క్రికెటర్ యువరాజ్​ సింగ్​తో జరిగిన ఇన్​స్టాలో లైవ్​చాట్​లో వీటితో పాటే చాలా విషయాలు బయటపెట్టాడు. అయితే జస్ప్రీత్ నంబర్.1 బౌలర్ అవుతాడని, అతడి కెరీర్​ ప్రారంభంలోనే తాను గుర్తించినట్లు చెప్పుకొచ్చాడు యువరాజ్.

"నేను ఎక్కువ కాలం ఆడనని చాలా మంది చెప్పారు. దేశం తరఫున ఆడే చివరి వ్యక్తిని అవుతానని అంచనా వేశారు. నా బౌలింగ్ యాక్షన్ చూసి, ఒకటి లేదా రెండు రంజీ మ్యాచ్​లు మాత్రమే ఆడతానని అభిప్రాయం వ్యక్తం చేశారు. నేను బౌలింగ్​ను టీవీలో చూసి నేర్చుకున్నా. నాకు ఎవరు ప్రేరణ కాదు. అండర్-19 వరకు నాకు విచిత్రమైన బౌలింగ్ యాక్షన్ ఉండేది. ఆ తర్వాత కొత్తదానికి మారా. అలా అభివృద్ధి చేసుకున్న తర్వాత మార్చాల్సిన అవరసం రాలేదు" -బుమ్రా, టీమిండియా పేసర్

jasprith bumrah
టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా

2016 జనవరిలో ఆస్ట్రేలియాతో వన్డేలో అరంగేట్రం చేశాడు బుమ్రా. ఇప్పటివరకు భారత్​ తరఫున 64 వన్డేలు, 50 టీ20లు, 14 టెస్టులు ఆడాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.