ETV Bharat / sports

మాజీలూ జాగ్రత్త.. యూట్యూబ్‌ జోలికి పోవొద్దు!

పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు యూట్యూబ్‌ ఛానళ్లు నడపకుండా పీసీబీ నిషేధం విధించిందని సమాచారం. దేశవాళీ క్రికెట్‌తో అనుబంధం ఉన్నవాళ్లు తమ అభిప్రాయాలను యూట్యూబ్‌ ద్వారా వెల్లడించకూడదని ఆదేశించినట్లు తెలుస్తోంది.

pcb latest news
మాజీలూ జాగ్రత్త.. యూట్యూబ్‌ జోలికి పోవొద్దు!
author img

By

Published : Aug 25, 2020, 3:20 PM IST

దేశవాళీ క్రికెట్‌ను సమూలంగా ప్రక్షాళన చేసేందుకు పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు నడుం బిగించింది. గతంలో జాతీయ జట్టుకు ఆడిన కొందరిని కోచ్‌లుగా ఎంపిక చేసింది. వీరితో కోచింగ్‌ ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. మహ్మద్‌ యూసుఫ్‌ను బ్యాటింగ్‌ కోచ్‌గా నియమించింది. అబ్దుల్‌ రజాక్‌, ఐజజ్‌ చీమా, బాసిత్‌ అలీ, ఫైసల్‌ ఇక్బాల్‌, గులామ్‌ అలీ, హుమయూన్‌ ఫర్హత్‌, ఇర్ఫాన్‌ అలీ, జాఫర్‌ ఇక్బాల్‌ వంటి అంతర్జాతీయ క్రికెటర్లు దేశవాళీలో కోచింగ్‌ ఇవ్వనున్నారు. వీరే కాకుండా మాజీ ఫస్ట్‌క్లాస్‌ క్రికెటర్లు అఫ్తాబ్‌ ఖాన్‌, అస్లామ్‌ ఖురేషీ, ఫహద్‌ మసూద్‌, హబీబ్‌ బాలూచ్‌, హఫీజ్‌ మజిద్‌ జహంగీర్‌, హనీఫ్‌ మాలిక్‌, మహ్మద్‌ సాధిక్‌ కూడా కోచింగ్‌ ప్యానెల్‌కు ఎంపికయ్యారు.

కోచింగ్‌ ప్యానెల్‌కు ఎంపికైన ఎవరూ యూట్యూబ్‌లో అభిప్రాయాలు వెల్లడించకూడదని పీసీబీ ఆదేశించిందట. ఎందుకంటే ఇంజమామ్‌ ఉల్‌ హఖ్‌, షోయబ్‌ అక్తర్‌, ఫైసల్‌ ఇక్బాల్‌ సహా మరికొందరు స్వేచ్ఛగా మాట్లాడుతున్నారు. అవసరమైతే పాక్‌ క్రికెట్‌ బోర్డును తీవ్రంగా విమర్శిస్తున్నారు. అందుకే సామాజిక మాధ్యమాల ద్వారా అభిప్రాయాలు చెప్పకూడదని పీసీబీ మెలిక పెట్టిందని అంటున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.