ETV Bharat / sports

పాక్ బోర్డు నిర్లక్ష్య ధోరణిపై ఇంజమామ్ ఆగ్రహం

author img

By

Published : Jun 27, 2020, 12:52 PM IST

కరోనా పాజిటివ్​గా తేలిన క్రికెటర్లతో పీసీబీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీ చీఫ్ సెలక్టర్ ఇంజమామ్ ఉల్​ హక్ చెప్పాడు​. ఈ క్లిష్ట పరిస్థితుల్లో వారికి నాణ్యమైన చికిత్స అందించాలని సూచించాడు.

PCB didn't attend calls of players: Inzamam-ul-Haq slams PCB medical staff
ఇంజమామ్ ఉల్ హక్

కరోనా సోకిన 10 మంది జట్టు సభ్యుల(9మంది క్రికెటర్లు, సహాయ సిబ్బందిలోని ఓ వ్యక్తి) పట్ల పాకిస్థాన్ క్రికెట్ బోర్డు, నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తోందని ఆ దేశ మాజీ ఛీప్​​ సెలక్టర్​ ఇంజమామ్​ ఉల్​ హక్ ఆరోపించాడు​. జట్టు వైద్య బృందం కూడా పట్టిపట్టనట్లు ఉందని మండిపడ్డాడు. ఇలా ఉండటం సమంజసం కాదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. వైరస్ సోకిన ఆటగాళ్లకు నాణ్యమైన చికిత్సను అందించి, క్లిష్ట పరిస్థితులో అండగా నిలవాల్సిన బాధ్యత బోర్డుకు ఉందని అభిప్రాయపడ్డాడు. ఈ విషయాల్ని తన యూట్యూబ్​ ఛానెల్​లో వెల్లడించాడు.

"ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా సోకిన పాక్ క్రికెటర్లకు బోర్డు నుంచి ఎలాంటి మద్దతు లభించట్లేదు. కనీసం వారిని పట్టించుకోవడం లేదు. వైద్య బృందం అలానే వ్యవహరిస్తోంది. వైరస్​ సోకిన ఆటగాళ్లు.. సూచనలు, సలహాలు కోసం వైద్యుల్ని సంప్రదించడానికి కాల్స్​ చేస్తుంటే కనీసం వారు ఎత్తట్లేదని తెలిసింది. దయచేసి పీసీబీ ఆ ఆటగాళ్లకు అండగా నిలవాలని కోరుకుంటున్నాను"

-ఇంజుమాన్​ ఉల్​ హక్​, పాక్​ మాజీ క్రికెటర్​.

జులై 13 నుంచి ఇంగ్లాండ్​, పాక్​ మధ్య ద్వైపాక్షిక సిరీస్​ జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్​ పర్యటనకు వెళ్లేముందు పాకిస్థాన్ ఆటగాళ్లకు చేసిన వైద్యపరీక్షల్లో.. సదరు క్రికెటర్లకు కరోనా ఉన్నట్లు తేలింది. వీరిలో ఫకర్​ జమాన్​, ఇమ్రాన్​ ఖాన్​, కాషిఫ్​ భట్టి, మహ్మద్​ హఫీజ్​, మహ్మద్​ హస్నెయిన్​, మహ్మద్​ రిజ్వాన్​, వాహబ్​ రియాజ్​ సహా పలువురు ఉన్నారు.

ఇది చూడండి : 2023 ప్రపంచకప్​ కోసం అప్పుడే ప్లాన్ వేశాడు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.