వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో నిర్వహించే టీ20 ప్రపంచకప్‌కు రెండు కొత్త జట్లు అర్హత సాధించాయి. పపువా న్యూ గునియా(పీఎన్‌జీ) ఆదివారం అర్హత సాధించగా అంతకుముందే ఐర్లాండ్ జట్టు మెగా ఈవెంట్‌లో చోటు దక్కించుకుంది. కెన్యాతో తలపడిన మ్యాచ్‌లో పీఎన్‌జీ మొదట 19 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినా, నార్మన్(54) బాధ్యతాయుతంగా ఆడడం వల్ల 118 పరుగులు చేయగలిగింది. లక్ష్య సాధనలో కెన్యా 18.4 ఓవర్లలో 73 పరుగులకే కుప్పకూలింది. పీఎన్‌జీ 45 పరుగుల తేడాతో గెలుపొందింది.
అయితే, ఈ మ్యాచ్ గెలిచినా పీఎన్‌జీ మెగా ఈవెంట్‌కు తొలుత అర్హత సాధించలేదు. ఫలితం మరో మ్యాచ్‌పై ఆధారపడటమే అందుకు కారణం. స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 12.3 ఓవర్లలో నిర్ణీత లక్ష్యం చేరుకోకపోవడం వల్ల నెట్ రన్‌రేట్ ఆధారంగా పీఎన్‌జీ అర్హత సాధించింది.
శనివారం ఐర్లాండ్ జట్టు కూడా నైజీరియాపై ఎనిమిది వికెట్లతో గెలుపొందినా దాని ఫలితం ఒమన్, జెర్సీ జట్ల మధ్య మ్యాచ్‌పై ఆధారపడింది. ఆ మ్యాచ్‌లో ఒమన్ గెలిచి ఉంటే ఐర్లాండ్ కథ ముగిసిపోయేది. కానీ, జెర్సీ జట్టు 14 పరుగులతో ఒమన్‌ను ఓడించడం వల్ల ఐర్లాండ్ అర్హత సాధించింది.
ఇవీ చూడండి.. విరుష్క జోడీ ప్రేమ టపాసులు నెట్టింట వైరల్!