టీమిండియా ప్రపంచకప్ జట్టులో కొత్త కుర్రాడు.. వికెట్‌కీపర్ బ్యాట్స్‌మెన్ పంత్‌కు చోటు లభించలేదు. అనుభవజ్ఞుడైన దినేశ్ కార్తిక్‌కు రెండో వికెట్ కీపర్‌గా అవకాశం దక్కింది. స్పందించిన చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్.. పంత్ కొద్దిలో అవకాశాన్ని చేజార్చుకున్నాడని అన్నారు.
''రెండో వికెట్ కీపర్ ఎంపికపై కమిటీతో చాలా సేపు చర్చించాం. మెగాటోర్నీలో సెమీస్, ఫైనల్స్‌లో ధోనికి గాయమైతే పరిస్థితి ఏంటా అనే ప్రశ్న వచ్చింది. ఆ సమయంలో ఒత్తిడిని తట్టుకుని ఆడగలిగే క్రికెటర్ ఎవరా అని ఆలోచించాం. అనుభవజ్ఞుడైన దినేశ్ కార్తీక్ సరైన ఎంపిక అని ఈ నిర్ణయం తీసుకున్నాం.'' -ఎమ్మెస్కే ప్రసాద్, బీసీసీఐ చీఫ్ సెలక్టర్
2016లో జరిగిన అండర్-19 ప్రపంచకప్‌లో పంత్ చెలరేగి ఆడాడు. టోర్నీలోనే అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఆ తర్వాత ఏడాదే ఇంగ్లండ్‌తో భారత్ ఆడిన టీట్వంటీ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. పంత్ ఆటతీరుపై ప్రశ్నించాల్సిన అవసరం లేదని.. కానీ సెలక్టర్ల దృష్టిలో పడాలంటే ఇంకా మెరుగుపడాల్సిన అవసరముందని ప్రసాద్ తెలిపారు.
గత 18 నెలలుగా దినేశ్ కార్తీక్ ఫినిషర్‌గా ఆకట్టుకున్నాడని ఎమ్మెస్కే చెప్పారు. గతేడాది జరిగిన నిదహాస్ ట్రోఫీ ఫైనల్లో ఒత్తిడిలోనూ మంచి ఇన్నింగ్స్ ఆడిన కార్తిక్.. జట్టును విజేతగా నిలిపాడు.
ఇది చదవండి: టీమిండియా చతుర్ముఖ వ్యూహమిదే...