టీమ్ఇండియా వికెట్‌కీపర్ బ్యాట్స్‌మన్ పంత్‌ను ఇంగ్లాండ్ మాజీ సారథి మైకేల్ వాన్ ప్రశంసించాడు. అతడు తన బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లకు దడ పుట్టిస్తాడని అన్నాడు. మ్యాచులను గెలిపించే సత్తా పంత్‌కు ఉందని అభిప్రాయపడ్డాడు. పంత్ ఆటను ఎంతో ఆస్వాదిస్తానని తెలిపాడు.
"విధ్వంసకర బ్యాటింగ్‌తో సెహ్వాగ్, ప్రత్యర్థి బౌలర్లను ఎలా భయపెడతాడో పంత్ కూడా అలానే చేస్తాడు. చిన్న తప్పిదాల వల్ల తక్కువ స్కోరుకే ఔట్ అయిపోతాడు. కానీ ఎన్నో సందర్భాల్లో మ్యాచులను గెలిపించాడు. బెన్స్టోక్స్లా పంత్ కూడా ఆస్వాదిస్తూ క్రికెట్ ఆడతాడు. వీరిద్దరి ఆటను నేను చాలా ఎంజాయ్ చేస్తాను"
-మైకేల్ వాన్, ఇంగ్లాండ్ మాజీ సారథి
ప్రస్తుతం భారత్ పర్యటనలో భాగంగా చెన్నైలో ఉంది ఇంగ్లాండ్. ఇరుజట్ల మధ్య నాలుగు టెస్టులు, ఐదు టీ20లు, మూడు వన్డేలు జరగనున్నాయి. ఫిబ్రవరి 5 నుంచి మొదటి టెస్టు ప్రారంభం కానుంది. తొలి రెండు టెస్టులు చెన్నైలో, మూడు(డేనైట్), నాలుగో మ్యాచ్‌కు అహ్మదాబాద్ (మెతేరా స్టేడియం) వేదిక కానుంది.
ఇదీ చూడండి: 'భారత్ విషయంలోనూ ఆసీస్ అలానే చేస్తుందా?'