ETV Bharat / sports

జింబాబ్వేపై పాకిస్థాన్​ క్లీన్​స్వీప్​

author img

By

Published : Nov 11, 2020, 7:34 AM IST

జింబాబ్వేతో జరిగిన మూడు టీ20ల సిరీస్​ను పాకిస్థాన్​ కైవసం చేసుకుంది. 3-0తో ప్రత్యర్థి జట్టును క్లీన్​ స్వీప్​ చేసింది. మూడో టీ20లో 8 వికెట్ల తేడాతో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

pakisthan has clean sweep jimbabwe in latest t20 series
అయ్యో జింబాబ్వే! క్లీన్​స్వీప్​ చేసేసిన పాకిస్థాన్​

జింబాబ్వేపై మూడు టీ20ల సిరీస్‌ను పాకిస్థాన్‌ 3-0తో క్లీన్‌ స్వీప్‌ చేసింది. మంగళవారం జరిగిన ఆఖరిదైన మూడో టీ20లో పాక్‌ 8 వికెట్ల తేడాతో ప్రత్యర్థిని చిత్తు చేసింది. ఉస్మాన్‌ ఖదీర్‌ (4/13), ఇమద్‌ వసీం (2/27) ధాటికి మొదట జింబాబ్వే 20 ఓవర్లలో 9 వికెట్లకు 129 పరుగులే చేసింది. చిబాబా (31) టాప్‌ స్కోరర్‌.

అరంగేట్ర ఆటగాడు షఫీఖ్‌ (41 నాటౌట్‌; 33 బంతుల్లో 4×4, 1×6)తో పాటు కుష్‌దిల్‌ షా (36 నాటౌట్‌; 15 బంతుల్లో 3×4, 3×6) రాణించడం వల్ల లక్ష్యాన్ని పాక్‌ 15.2 ఓవర్లలో 2 వికెట్లే కోల్పోయి ఛేదించింది. అంతకుముందు కెరీర్‌లో ఆఖరి మ్యాచ్‌ ఆడుతున్న జింబాబ్వే ఆల్‌రౌండర్‌ ఎల్టాన్‌ చిగుంబుర పాక్‌ ఆటగాళ్ల నుంచి గౌరవ వందనాన్ని అందుకున్నాడు.

ఇదీ చూడండి:పాకిస్థాన్​ టెస్టు కెప్టెన్​గా బాబర్​ అజామ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.