ETV Bharat / sports

పాక్ క్రికెటర్లకు వీసా ఇస్తారో? లేదో? - టీ20 ప్రపంచ కప్​ పాక్​ ఆటగాళ్లకు వీసా

ప్రపంచకప్​ ఆడే పాకిస్థాన్‌ ఆటగాళ్లకు భారత వీసాల మంజూరుపై తమకు హామీ ఇవ్వాలని పీసీబీ సీఈవో వసీమ్ ‌ఖాన్ ఐసీసీని కోరారు. ఈ విషయాన్ని ఆయనే చెప్పారు.‌

Pakistan
పాకిస్థాన్‌
author img

By

Published : Oct 19, 2020, 8:57 PM IST

వచ్చే ఏడాది భారత్​లో టీ20 ప్రపంచకప్​ జరగనుంది. అయితే ఇందులో పాల్గొనేందుకు వీసాలు ఇస్తారో లేదో అనే విషయమై పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డులో ఆలోచన మొదలైంది. ఇందులో ఆడే తమ ఆటగాళ్లు, సహాయక సిబ్బందికి వీసాల మంజూరుపై హామీ ఇవ్వాలని ఐసీసీని కోరినట్లు పీసీబీ సీఈవో వసీమ్ ‌ఖాన్‌ వెల్లడించారు. ఏ ఇబ్బంది లేకుండా తమ క్రికెటర్లు ఆడేలా చూడాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.

ఈ విషయంలో ఐసీసీ జోక్యం చేసుకుని.. భారత ప్రభుత్వం, బీసీసీఐతో చర్చించాలని వసీమ్ ఖాన్ కోరారు. అంతర్జాతీయ క్రికెట్​ కౌన్సిల్​ త్వరలోనే దీనిపై సమాధానమిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

2008 నుంచి భారత జట్టు పాక్‌లో పర్యటించలేదు. 2012లో పాక్​, ఇక్కడ టీ20 సిరీస్​​ ఆడింది. ఉగ్రవాదం నిర్మూలించేంత వరకు దాయాది దేశంతో ఆడేందుకు టీమ్​ఇండియాను అనుమతించమని కేంద్ర ప్రభుత్వం గతంలో ప్రకటించింది. అందుకే ఐసీసీ టోర్నీల్లో మాత్రమే భారత్-పాక్​లు తలపడుతున్నాయి.

పదేళ్ల క్రితం శ్రీలంక జట్టు బస్సుపై లాహోర్‌లో ఉగ్రదాడి జరిగింది. ఆ తర్వాత ఏ దేశమూ పాక్​ గడ్డపై అడుగుపెట్టలేదు. గతేడాది లంకేయులే మళ్లీ అక్కడ మ్యాచ్​లు ఆడారు.

ఇదీ చూడండి 'అలా బౌలింగ్​ చేస్తే కోహ్లీ, రోహిత్​కైనా కష్టమే'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.