టీమ్ మేనేజ్మెంట్, జట్టు ఆటగాళ్ల మధ్య సమాచార సమన్వయం లోపించిందని అన్నాడు పాక్ పేసర్ మహ్మద్ ఆమిర్. బోర్డు విధానం వల్ల.. అలిసిపోయినప్పుడు కనీసం విరామం అడగడానికి కూడా క్రికెటర్లు భయపడుతున్నారని చెప్పాడు.
"ధైర్యం చేసి విరామం కావాలని అడిగితే వారిని జట్టు నుంచి తొలగించేస్తారన్న భయం ఆటగాళ్లలో ఉంది. మేనేజ్మెంట్, ఆటగాళ్ల మధ్య కమ్యునికేషన్ గ్యాప్ తొలిగిపోవాలని నా అభిప్రాయయం. ఇలా ఉండటం సరైనది కాదు. ఆటగాళ్లను బోర్డు అర్థం చేసుకోవాలి. "
-మహ్మద్ ఆమిర్, పాక్ క్రికెటర్
అందుకే రిటైర్మెంట్
మహ్మద్ ఆమిర్.. చిన్న వయసులోనే టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయం సర్వత్రా చర్చకు దారితీసింది. దీనిపై అతడు స్పందిస్తూ.. "నేను వీడ్కోలు పలికాక నాతో ఆరు నెలల వరకు ఎవరూ మాట్లాడలేదు. నా నిర్ణయంపై పెద్ద వివాదమే చెలరేగింది. చాలా మంది అనేక రకాలుగా మాట్లాడుకున్నారు. నా శరీరం సరిగ్గా సహకరించకపోవడం వల్లే రిటైర్మెంట్ ప్రకటించా. మరో కారణమేమీ లేదు" అని వెల్లడించాడు.
ఇదీ చూడండి : 'ఆమిర్ వీడ్కోలు నిర్ణయం ఆశ్చర్యకరం'