న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన పాకిస్థాన్ జట్టు.. మ్యాచ్‌లు ఆడకుండానే స్వదేశానికి వచ్చే విషయమై తమ దేశ బోర్డుతో చర్చలు జరుపుతోంది. ఈ విషయాన్ని ప్రధాన కోచ్ మిస్బా ఉల్ హక్ చెప్పారు.
డిసెంబరు 18 నుంచి మొదలు కాబోయే ఈ పర్యటనలో భాగంగా పాక్, కివీస్ జట్లు మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడాలి. అయితే ఎనిమిది పాక్ ఆటగాళ్లకు కొవిడ్ పాజిటివ్‌గా తేలడం, ఐసోలేషన్‌లో ఉన్న ఆ దేశ క్రికెటర్లు నిబంధనలు అతిక్రమించిన కారణాల దృష్టా సిరీస్ నిర్వహణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అన్ని అడ్డంకులు పూర్తి చేసుకున్న పాక్ బృందం.. ఇటీవలే ప్రాక్టీసు ఆరంభించింది. కానీ ఇప్పుడు పర్యటనను రద్దు చేసే విషయమై ఆలోచన చేస్తుండటం వల్ల ఇది చర్చనీయాంశమైంది.
అయితే ఆతిథ్య జట్టు అన్ని విభాగాల్లో బలంగా ఉందని చెప్పిన పాక్ కోచ్ మిస్బా.. తమ బృందం కూడా అలానే ఉందని అన్నారు. బౌలర్లు 150 కిలోమీటర్ల వేగంతో బంతులు వేస్తున్నారని చెప్పారు. కెప్టెన్ బాబర్ అజమ్ మెరుగుదల చాలా బాగుందని తెలిపారు.