భారత్- పాకిస్థాన్ మ్యాచ్ అంటే క్రికెట్ అభిమానులకు ఆసక్తి ఎక్కువ. ఐసీసీ టోర్నీల్లో ఈ రెండు జట్లు తలపడితే ఫ్యాన్స్‌కు పండగే పండగ. ప్రస్తుత ప్రపంచకప్‌లో జూన్ 16న ఈ రెండింటి మధ్య మ్యాచ్ జరగనుంది. పాక్‌తో జరిగే ఈ మ్యాచ్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తామని టీమిండియా కెప్టెన్ కోహ్లీ చెప్పాడు.
"క్రికెట్లో ప్రపంచకప్ అత్యుత్తమమైనది. పాక్‌తో ఈ టోర్నీలో ఆడటం నిజంగా అదృష్టంగా భావిస్తున్నా. ఆ రోజు అత్యుత్తమ ఆట కనబరుస్తాం. ఓ ప్రణాళికను సిద్ధం చేసుకున్నాం. కచ్చితంగా అమలు పరుస్తాం ." -విరాట్ కోహ్లీ, టీమిండియా కెప్టెన్
గురువారం న్యూజిలాండ్‌తో జరగాల్సిన భారత్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఇరుజట్లకు చెరో పాయింట్ కేటాయించారు. ప్రస్తుతం టీమిండియా మూడో స్థానంలో ఉంది.
శిఖర్ ధావన్ గాయంపైనా స్పందించాడు భారత క్రికెట్ జట్టు సారథి కోహ్లీ
"కొన్ని వారాల పాటు శిఖర్‌కు విశ్రాంతి అవసరం. చివరి లీగ్ మ్యాచ్‌ల సమయానికి అతడు సిద్ధమవుతాడని ఆశిస్తున్నా. ధావన్ రాక కోసం మేం ఎదురు చూస్తున్నాం" --విరాట్ కోహ్లీ, టీమిండియా కెప్టెన్
ఇది చదవండి: భారత్ -కివీస్ మ్యాచ్ వర్షార్పణం