ETV Bharat / sports

పాకిస్థాన్​​​ సూపర్​ లీగ్​లో.. ధోనీ పేరు, నంబర్​తో జెర్సీ - మహేంద్ర సింగ్​ ధోనీ

మహేంద్ర సింగ్​ ధోనీ.. భారత్​కు మూడు ఫార్మాట్లలో ఐసీసీ ప్రపంచకప్​లు అందించిన ఏకైక సారథి. తనదైన కూల్​ కెప్టెన్సీతో పేరు తెచ్చుకున్న ఇతడు.. ప్రత్యేకమైన ఆటతీరుతోనూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. తాజాగా పాకిస్థాన్​ సూపర్​ లీగ్​(పీఎస్​ఎల్​)లో ఓ అభిమాని ధోనీ పేరు, నంబర్​ జెర్సీతో కనిపించి మహీపై అభిమానాన్ని చాటుకున్నాడు.

Pakistan Fan Showed his Impression on Dhoni through wear 7 number Jersey in PSL 2020
పాక్​​ సూపర్​ లీగ్​లో ధోనీ పేరు, నంబర్​తో జెర్సీ
author img

By

Published : Mar 10, 2020, 5:30 PM IST

టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీకి భారత్‌లో ఎంత ఫాలోయింగ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ స్టార్​ క్రికెటర్​ ఆటకు దూరమై దాదాపు 8 నెలలైనా అతడి పునరాగమనం కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. మరోవైపు ధోనీపై అభిమానం దేశం దాటి పొరుగు దేశానికి చేరింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌లోనూ మహీకి అభిమానులున్నారని తెలుసు. అయితే, ఆ అభిమానాన్ని మరింత ప్రత్యేకంగా, వినూత్నంగా చాటుకున్నాడు ఓ వ్యక్తి.

dhoni latest news
ధోనీ నంబర్​తో పాక్​ అభిమాని జెర్సీ

ప్రస్తుతం దాయాది దేశంలో పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌(పీఎస్​ఎల్​) ఐదో సీజన్‌ జరుగుతోంది. ఇందులో ఇస్లామాబాద్‌ యునైటెడ్‌ ఇటీవల ముల్తాన్‌ సుల్తాన్‌తో తలపడింది. ఆ మ్యాచ్‌ చూడడానికి వచ్చిన ఇస్లామాబాద్‌ అభిమాని ఒకడు.. పాకిస్థాన్‌ జట్టు జెర్సీని ధరించాడు. దానిపై ధోనీ పేరుతో సహా అతడి నంబర్‌ 7 ఉండటం విశేషం. మ్యాచ్‌ జరుగుతుండగా అతడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.

మరోవైపు ధోనీ క్రికెట్‌లో పునరాగమనం చేసేందుకు సిద్ధమయ్యాడు. ఈనెల 29 నుంచి జరగబోయే ఐపీఎల్‌ కోసం ప్రస్తుతం సన్నాహాల్లో ఉన్నాడు. ఇప్పటికే చెన్నై చేరుకున్న సీఎస్కే సారథి.. చెపాక్‌లో సాధన మొదలెట్టాడు. ముంబయి ఇండియన్స్‌తో ఆరంభ మ్యాచ్‌లో ధోనీ బరిలోకి దిగే అవకాశముంది. ఈ లీగ్​ ప్రదర్శనతోనే ఇతడు ఈ ఏడాది ప్రపంచకప్​లో చోటు దక్కించుకునేది లేనిది తేలనుంది.

dhoni latest news
ధోనీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.