ETV Bharat / sports

'పాకియతాన్'​తో ట్రోల్స్​ ఎదుర్కొంటున్న పీసీబీ - misspelling Pakistan as Pakiatan

ఇంగ్లాండ్​​ పర్యటనకు పాకిస్థాన్​ క్రికెట్​ జట్టు ఆదివారం బయలుదేరి వెళ్లింది. ఈ నేపథ్యంలో ఆ జట్టుకు సంబంధించిన ట్విట్టర్​ ఖాతాలో పాకిస్థాన్​ పేరును తప్పుగా రాసి బోర్డు అడ్డంగా బుక్కైంది. పాకిస్థాన్​కు బదులుగా 'పాకియతాన్​' అని రాయగా.. దీనిపై నెటిజన్లు ట్రోల్స్​తో విరుచుకుపడుతున్నారు.

Pakistan Cricket Board gets trolled on Twitter after misspelling Pakistan as Pakiatan
'పాకియతాన్'​తో ట్రోల్స్​ ఎదుర్కొంటున్న పాక్​ క్రికెట్​ బోర్డు
author img

By

Published : Jun 30, 2020, 9:54 AM IST

పలు నాటకీయ పరిణామాల అనంతరం పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఇంగ్లాండ్‌లో అడుగుపెట్టింది. ఈ పర్యటనకు బయలుదేరే ముందు పాక్‌ ఆటగాళ్లకు కొవిడ్‌-19 పరీక్షలు నిర్వహించగా పది మందికి పాజిటివ్‌గా తేలింది. పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) అధికారికంగా నిర్వహించిన పరీక్షల్లో మహమ్మద్‌ హఫీజ్‌కు పాజిటివ్‌ వచ్చింది. అనుమానంతో అతడు ప్రైవేటులో పరీక్షించుకోగా నెగెటివ్‌ అని తేలింది. ఈ విషయాన్ని అతడు ట్విట్టర్​లో పేర్కొన్నాడు. దీనిపై పీసీబీ ఒకింత అసహనం వ్యక్తం చేసింది.

ఇవి చాలవన్నట్లు.. ఆదివారం పీసీబీ తన ట్వీట్‌లో దేశం పేరును తప్పుగా రాసి సామాజిక మాధ్యమాల్లో విపరీతమైన ట్రోల్స్‌ ఎదుర్కొంటోంది. పాకిస్థాన్‌కు బదులుగా 'పాకియతాన్‌ జట్టు ఇంగ్లాండ్‌కు బయలుదేరింది. ఆల్‌ ది బెస్ట్‌ బాయ్స్‌' అని ట్వీట్‌ చేసింది. దీంతో నెటిజన్లు 'పాకియతాన్'‌ ఎక్కడ ఉంది అని ప్రశ్నిస్తూ ట్రోల్స్​ చేస్తున్నారు. పలు మీమ్స్‌ కూడా సృష్టిస్తున్నారు. ఓ గంట తర్వాత పీసీబీ తప్పును తెలుసుకొని సరిదిద్దుకుంది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

Pakistan Cricket Board gets trolled on Twitter after misspelling Pakistan as Pakiatan
పాకిస్థాన్​ పేరును 'పాకియతాన్​' అని తప్పుగా రాసిన ట్వీట్​

ఇదీ చూడండి... నాకు కరోనా వచ్చిందని తెలియదు: బోథమ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.