ETV Bharat / sports

ఐపీఎల్.. స్పిన్నర్లు కాదు పేసర్లదే హవా - delhi capitals

ఐపీఎల్ 12వ సీజన్​లో పేసర్లు మంచి ప్రదర్శన కనబరుస్తున్నారు. స్పిన్నర్లతో పోలిస్తే ఎక్కువ వికెట్లతో రాణిస్తున్నారు. వారి ప్రదర్శనను ఓసారి చూద్దాం.

రబాడ
author img

By

Published : Apr 28, 2019, 2:28 PM IST

ఐపీఎల్ పోరు రసవత్తరంగా సాగుతోంది. ప్లే ఆఫ్స్​లో చోటు సంపాదించుకోవడం కోసం అన్ని జట్లు శ్రమిస్తున్నాయి. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్​ల్లోని బౌలింగ్ గణంకాల్ని చూస్తే పేసర్లు 110 వికెట్లు తీసుకుని సత్తాచాటగా.. స్పిన్నర్లు 66 వికెట్లు తీసుకున్నారు. 13 మంది బౌలర్లు ఈ సీజన్​లో 10 వికెట్ల కంటే ఎక్కువ తీసుకున్నారు. ఇందులో 8 మంది పేసర్లు కాగా, ఐదుగురు స్పిన్నర్లు ఉన్నారు.

ఐపీఎల్ అంటేనే స్పిన్నర్లకు వరం లాంటింది. ప్రతి సీజన్​లో జట్టు గెలుపులో వారే కీలకపాత్ర పోషించారు. కానీ 12వ సీజన్​లో స్పిన్నర్లను వెనక్కినెట్టారు పేస్​ బౌలర్లు.

బౌలింగ్ విభాగంలో ఎక్కువ వికెట్లు తీసుకున్న వారిలో దిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు రబాడ ముందున్నాడు. ఈ సీజన్​లో 11 మ్యాచ్​లాడి 23 వికెట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. రబాడ సహా 10 వికెట్లకు పైగా తీసిన ఫాస్ట్ బౌలర్లు.. దీపర్ చాహర్ (15, చెన్నై సూపర్ కింగ్స్, షమీ (14, కింగ్స్ ఎలెవన్ పంజాబ్), బుమ్రా (13, ముంబయి ఇండియన్స్), మలింగ (12, ముంబయి ఇండియన్స్), క్రిస్ మోరిస్ (12, దిల్లీ క్యాపిటల్స్), జోఫ్రా ఆర్చర్ (11, రాజస్థాన్ రాయల్స్), సందీప్ శర్మ (10, సన్​రైజర్స్ హైదరాబాద్).

స్పిన్నర్లలో పది అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్లు... ఇమ్రాన్ తాహిర్ (17, చెన్నై సూపర్ కింగ్స్), చాహల్ (14, బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్), శ్రేయస్ గోపాల్ (13, రాజస్థాన్ రాయల్స్), అశ్విన్ (12, కింగ్స్ ఎలెవన్ పంజాబ్), రషీద్ ఖాన్ (10, సన్​రైజర్స్ హైదరాబాద్).
సీజన్​లో ఉత్తమ బౌలింగ్ ప్రదర్శన చూస్తే ముంబయి ఇండియన్స్ బౌలర్ అల్జారీ జోసెఫ్ 12 పరుగులకు 6 వికెట్లతో ముందున్నాడు. ఈ గణాంకాలు ఐపీఎల్ చరిత్రలోనే ఉత్తమమైనవి. ఇంతకు ముందు రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు సోహైల్ తన్వీర్ 14 పరుగులకు 6 వికెట్లు తీశాడు. ఈ రికార్డును జోసెఫ్ తిరగరాశాడు.

ఇంకా కొన్ని లీగ్ మ్యాచ్​లతో పాటు ప్లేఆఫ్స్​ జరగాల్సి ఉంది.

ఇవీ చూడండి.. 'బెంగళూరుపై సత్తా చాటి స్వదేశానికి వెళతా'

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
++SHOTLIST AND TRANSLATIONS TO FOLLOW++
SHOTLIST: Stade de France, Paris, France - 27 April 2019
1.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
SOURCE: SNTV
DURATION: 05:47
STORYLINE:
Kylian Mbappe was sent off as Rennes beat Paris St Germain on penalties in Saturday's Coupe de France final.
Dani Alves and Neymar gave PSG a two-goal lead but Presnel Kimpembe's own goal and Mexer's header either side of the interval levelled the match at 2-2 and led to extra time.
France star Mbappe saw red just before the end and after a perfect 10 penalties from the designated takers, Ismaila Sarr put Rennes 6-5 up and Christopher Nkunku blazed over to hand Rennes the trophy.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.