ETV Bharat / sports

'ధోనీ అప్పుడెలా ఉన్నాడో ఇప్పుడూ అలానే ఉన్నాడు' - ms dhoni retirement

ఇటీవలే ఐపీఎల్ ప్రాక్టీస్​లో పాల్గొన్న ధోనీ గురించి మాట్లాడాడు భారత మాజీ పేసర్ లక్ష్మీపతి బాలాజీ. మహీ సాధనలో ఎలాంటి మార్పులు రాలేదని అన్నాడు. ఆలోచన ధోరణి ఎప్పటిలానే ఉందని చెప్పాడు.

'ధోనీ అప్పుడెలా ఉన్నాడో ఇప్పుడూ అలానే ఉన్నాడు'
మహేంద్ర సింగ్ ధోనీ
author img

By

Published : Mar 30, 2020, 6:59 PM IST

టీమిండియా మాజీ సారథి, చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ.. రెండేళ్ల క్రితం ఎలా ఉన్నాడో ఇప్పుడూ అలానే ఉన్నాడని సీఎస్కే బౌలింగ్‌ కోచ్‌ లక్ష్మీపతి బాలాజీ అన్నాడు. తాజాగా ఓ ఆంగ్ల మీడియా సంస్థతో మాట్లాడిన ఈ మాజీ పేసర్‌.. ఇటీవలే చెన్నైలో ధోనీ చేసిన ప్రాక్టీస్‌ గురించి వివరించాడు.

'ధోనీ భవిష్యత్‌ గురించి ఆలోచించడు. పరిస్థితులకు తగ్గట్టు అప్పటికప్పుడే నిర్ణయాలు తీసుకుంటాడు. ఇదివరకు ఎలా ఉన్నాడో ఇప్పుడూ అలాగే ఉన్నాడు. తన ధ్యాసంతా మునుపటిలా ట్రైనింగ్‌ మీదే కేంద్రీకరించాడు. అతడి సాధనలో ఎలాంటి మార్పులు రాలేదు. తన ఆలోచనా ధోరణి ఎప్పటిలానే ఉంది' -లక్ష్మీపతి బాలాజీ, భారత మాజీ పేసర్

ఐపీఎల్‌లో రాణించేందుకు ఈనెల తొలి వారంలో చెన్నై చేరుకున్న ధోనీ.. వారం పాటు ప్రాక్టీస్‌ చేశాడు. రైనా, రాయుడూ అక్కడే సాధన చేశారు.

CSK CAPTAIN DHONI
చెన్నై సూపర్​ కింగ్స్ కెప్టెన్ ధోనీ

గత ఎనిమిది నెలలుగా ఆటకు దూరమైన మహీ.. ఐపీఎల్‌లో రాణించి, మళ్లీ భారత జట్టులోకి వస్తాడని ఆశించగా అభిమానులకు నిరీక్షణ తప్పలేదు. కరోనా ప్రభావంతో ఐపీఎల్‌ వాయిదా పడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని క్రీడా ఈవెంట్ల షెడ్యూల్లు సందిగ్ధంలో పడ్డాయి. మరోవైపు ధోనీ భవితవ్యంపైనా సందేహాలు మొదలవుతున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.