సచిన్ తెందుల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీలు భారత్ క్రికెట్ చరిత్రలో అద్భుతాల్ని సృష్టించారు. వీరికన్నా ముందే 1983లోనే టీమ్ఇండియాకు ప్రపంచకప్ అందించాడు దిగ్గజ కపిల్ దేవ్. ఇప్పుడు అతడిని మాజీ ఆటగాడు సునీల్ గావస్కర్ గుర్తు చేసుకున్నాడు. తన దృష్టిలో ఆల్‌టైమ్ నెం.1 అంటే కపిల్ అని చెప్పాడు. క్లిష్టపరిస్థితుల్లో వ్యూహాత్మకంగా ఆడి, ఎన్నో విజయాలు అందించాడని ప్రశంసించాడు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్ని విభాగాల్లో ఆరితేరిన ఓ సంపూర్ణమైన క్రికెటర్ అని కితాబిచ్చాడు.
టీమ్ఇండియాకు కెప్టెన్సీ సహా 1983 ప్రపంచకప్ గెల్చుకోవడంలో కపిల్‌దేవ్ కీలకపాత్ర పోషించాడు. ఎంతో మంది భారత క్రికెటర్లకు స్ఫూర్తిగా నిలిచాడు. బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలోనూ అతడి సామర్థ్యం అమోఘం. వికెట్లు బాగా తీస్తాడు. 80-90 బంతుల్లోనే సెంచరీ చేసి పూర్తి ఆట రూపురేఖలనే మార్చేసేవాడు. అద్భుతమైన క్యాచ్‌లు పట్టాడు. మొత్తంగా ఓ సంపూర్ణమైన ఆటగాడు కపిల్‌దేవ్.
-గావస్కర్, టీమ్ఇండియా మాజీ క్రికెటర్
ఇది చూడండి 'ప్రపంచ యుద్ధం జరిగినా ఆయన ఫామ్ చెక్కు చెదరలేదు'