ETV Bharat / sports

భారత క్రికెటర్లపై పాక్​ దిగ్గజం ప్రశంసలు

టీమ్​ఇండియా సీనియర్​ స్పిన్నర్​ రవిచంద్రన్​ అశ్విన్​పై ప్రశంసల వర్షం కురిపించాడు పాక్​ స్పిన్​ దిగ్గజం సక్లెయిన్​ ముస్తాక్​. స్వదేశీ పిచ్​పై అతడు చెలరేగిపోతాడని కితాబిచ్చాడు. భారత క్రికెటర్లు కోహ్లీ, జడేజా, కుల్​దీప్​ యూదవ్​నూ ప్రశంసించాడు ఈ పాకిస్థాన్​ మాజీ ఆటగాడు.

mustak
ముస్తాక్​
author img

By

Published : Jun 16, 2020, 7:28 PM IST

టీమ్‌ఇండియా సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌.. స్వదేశంలో ప్రమాదకర బౌలర్‌ అని అభిప్రాయపడ్డాడు పాకిస్థాన్‌ స్పిన్‌ దిగ్గజం సక్లెయిన్‌ ముస్తాక్‌. తాజాగా అతడు ఓ పాక్‌ మీడియాతో మాట్లాడుతూ.. భారత క్రికెటర్లపై సానుకూలంగా స్పందించాడు.

"స్పిన్నర్ల గురించి మాట్లాడాల్సి వస్తే భారత్‌లో అశ్విన్‌కి మించిన పెద్ద బౌలర్‌ లేడు. విదేశాలు, స్వదేశీ పిచ్‌లపై చెలరేగిపోతాడు. టెస్టుల్లో రవీంద్ర జడేజా బాగా ఆడతాడు. అలాగే పొట్టి క్రికెట్‌లో కుల్‌దీప్‌ యాదవ్‌ ఉన్నాడు.

-ముస్తక్‌, పాక్​ స్పిన్​ దిగ్గజం.

అనంతరం టీమ్‌ఇండియా సారథి విరాట్‌కోహ్లీ, పాకిస్థాన్‌ బ్యాట్స్‌మన్‌ బాబర్‌ అజామ్‌ల మధ్య పోలికలపై స్పందించాడు. ఇద్దర్నీ పోల్చడం సరికాదన్నాడు.

"వాళ్లిద్దరూ గొప్ప ఆటగాళ్లు. ఇద్దిరికీ మంచి నైపుణ్యం ఉంది. మానసికంగా దృఢంగా ఉంటారు. వాళ్లకు బాగా పరుగులు చేయాలనే కసి, పట్టుదల ఉన్నాయి. కానీ కోహ్లీ దూకుడు స్వభావం గలవాడు. ఈ విషయంలో బాబర్‌ వినయంగా ఉంటాడు. ప్రశాంతంగా ఉండే అతడి స్వభావమే కోహ్లీపై పైచేయి సాధించేందుకు తోడ్పడుతుంది. అలాంటి విభిన్న స్వభావాలు గలవారి మధ్య పోటీ ఉంటుంది. అందులో ప్రశాంతంగా ఉండేవాళ్లే గెలుస్తారు" అని పాక్‌ దిగ్గజం వివరించాడు.

చివరగా కోహ్లీ శారీరకంగా దృఢంగా ఉంటాడని, బాబర్‌ అలా కనిపించకపోయినా ఫిట్‌గా ఉంటాడన్నాడు. అయితే, అతడెంత కాలం అలా ఉంటాడో తెలియదని సందేహం వెలిబుచ్చాడు.

ఆస్ట్రేలియా స్పిన్నర్‌ నాథన్‌ లయన్‌ను సైతం కొనియాడాడు ముస్తాక్. ‌ ప్రస్తుతం అతడు మంచి బౌలింగ్‌ చేస్తున్నాడని.. ఇంగ్లాండ్‌, పాకిస్థాన్‌, భారత జట్లపై మంచి ప్రదర్శన చేశాడని అన్నాడు.

ఇది చూడండి :'సుశాంత్ అచ్చం ధోనిలాగే అనిపించాడు'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.