ETV Bharat / sports

విరుష్క జోడీ, చాహల్​కు ఆర్సీబీ ట్రీట్​ - rcb treat to kohli chahal

విరుష్క జోడి, చాహల్​కు శుభాకాంక్షలు తెలుపుతూ కేక్​ కటింగ్​​ పార్టీ నిర్వహించింది ఆర్సీబీ యాజమాన్యం. ఈ వేడుకలో సామాజిక దూరం పాటిస్తూ జట్టు సభ్యులందరూ పాల్గొన్నారు.

Chahal
విరుష్క జోడి
author img

By

Published : Aug 29, 2020, 3:00 PM IST

ఐపీఎల్​లో భాగంగా దుబాయ్​లో ఉన్న బెంగళూరు జట్టు.. విజయవంతంగా క్వారంటైన్​ పూర్తి చేసుకుంది.​ ఇటీవలే కోహ్లీ తండ్రి కానుండటం, చాహల్​ నిశ్చితార్థం చేసుకున్న సంద్భరంగా వీరిద్దరికీ శుభాకాంక్షలు తెలుపుతూ కేక్​ కటింగ్​ నిర్వహించింది యాజమాన్యం. జట్టు సభ్యులందరూ సామాజిక దూరం పాటిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విరాట్​-అనుష్క కేక్​ కట్​ చేయగా.. అందరూ ఆనందంతో సరదాగా గడిపారు. ఈ వీడియోను ఆర్సీబీ ట్వీట్ చేసింది.

  • 7 days of quarantine in Bengaluru followed by 7 days in Dubai and 6 COVID tests later, the team finally got a chance to spend quality time together in a dedicated private beach and a state of the art team room, within the secure bio bubble.#PlayBold #IPL2020 #WeAreChallengers pic.twitter.com/UweXBqhjlv

    — Royal Challengers Bangalore (@RCBTweets) August 29, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఐపీఎల్​ కోసం యూఏఈ వెళ్లిన ఆటగాళ్లందరూ ఆరు రోజుల పాటు క్వారంటైన్​ను ఇటీవల పూర్తిచేసుకున్నారు. ఈ సమయంలో మూడుసార్లు చేసిన కరోనా నిర్థరణ పరీక్షల్లో ఆర్సీబీ క్రికెటర్లకు నెగటివ్​గా తేలింది. దీంతో శిక్షణలో పాల్గొన్నారు. త్వరలో బయోబబుల్​లోకి అడుగుపెట్టనున్నారు.

సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు ఈ సీజన్ జరగనుంది. చెన్నై జట్టులోని సభ్యులకు కరోనా పాజిటివ్ రావడం వల్ల టోర్నీ షెడ్యూల్​ మారే అవకాశముందనే ప్రచారమూ సాగుతోంది.

ఇది చూడండి సీఎస్కేకు దెబ్బ మీద దెబ్బ.. మరో ఆటగాడికి కరోనా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.