యువ క్రికెటర్లు పైకి ఎదిగే క్రమంలో దగ్గరి దారులు వెతకొద్దని అన్నాడు దిగ్గజ సచిన్ తెందుల్కర్. సవాళ్లు ఎదురైనప్పుడు మోసం చేసే ప్రయత్నం చేయొద్దని వారికి సూచించాడు. అలా చేస్తే దొరికిపోతారని, పరువు పోతుందని హెచ్చరించాడు. ముంబయిలో మంగళవారం తన సొంత క్రికెట్ అకాడమీ 'టెండూల్కర్ మిడిలెసెక్స్ గ్లోబల్ అకాడమీ డీవై పాటిల్ స్పోర్ట్స్ సెంటర్' ప్రారంభోత్సవంలో మట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు.
"క్రమశిక్షణ, ఏకాగ్రత, ప్రణాళిక తదితర అంశాల గురించి జీవితంలో ఎన్నో నేర్చుకున్నా. చాలాసార్లు అంచనాలకు తగిన విధంగా ఆడలేక విఫలమయ్యా. అదే మళ్లీ సరైన దిశలో వెళ్లేందుకు నాకు ఆట ఉపయోగపడింది. ఈ క్రమంలో దగ్గర దారుల్లేవని అర్థమైంది. సవాళ్లు ఎదురైనా మోసం చేయకుడదాని తెలుసుకున్నా" -సచిన్ తెందుల్కర్, టీమిండియా క్రికెటర్
ఈ కార్యక్రమంలో అతడితో పాటు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైక్ గ్యాటింగ్, మంబయి క్రికెట్ సంఘ అధ్యక్షుడు విజయ్ పాటిల్ ఉన్నారు.
ఇది చదవండి: మోసపోయిన సచిన్ తెందూల్కర్ వీరాభిమాని..!