ఆస్ట్రేలియాలో వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో మరో కొత్త జట్టు కనువిందు చేయనుంది. ఈ టోర్నీలో పాల్గొనెేందుకు నెదర్లాండ్స్ అర్హత సాధించింది. టీ20 ప్రపంచకప్ క్వాలిఫయర్ మ్యాచ్‌లో... యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)పై ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచింది. ఫలితంగా ప్రపంచకప్‌కు బెర్త్ దక్కించుకుంది డచ్ టీమ్.
-
Qualifier number 13 confirmed for Australia!
— T20 World Cup (@T20WorldCup) October 29, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Congratulations Netherlands, what a performance from them today 👏 pic.twitter.com/rYV37P8Oup
">Qualifier number 13 confirmed for Australia!
— T20 World Cup (@T20WorldCup) October 29, 2019
Congratulations Netherlands, what a performance from them today 👏 pic.twitter.com/rYV37P8OupQualifier number 13 confirmed for Australia!
— T20 World Cup (@T20WorldCup) October 29, 2019
Congratulations Netherlands, what a performance from them today 👏 pic.twitter.com/rYV37P8Oup
తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 80 పరుగులే చేసింది. నెదర్లాండ్స్ బౌలర్ల ధాటికి తొమ్మిది పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. ఆ సమయంలో అహ్మద్ (22), వాహబ్ (19) ఫర్వాలేదనిపించడం వల్ల యూఏఈ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. నెదర్లాండ్స్ బౌలర్లలో గ్లోవర్ నాలుగు వికెట్లతో సత్తా చాటాడు.
స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ జట్టు... రెండు వికెట్లు కోల్పోయి 15.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. బ్యాటింగ్‌లో బెన్ కూపర్ (41*) రాణించాడు. 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా గ్లోవర్ నిలిచాడు. న్యూగినియా, ఐర్లాండ్ కూడా టీ20 ప్రపంచకప్‌కు ఇటీవలే అర్హత సాధించాయి.
వచ్చే ఏడాది అక్టోబరు 18 నుంచి టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. నవంబరు 15న మెల్‌బోర్న్‌లో ఫైనల్ జరుగుతుంది. ఈ ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా, భారత్, పాకిస్థాన్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, వెస్టిండీస్, అఫ్గానిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్‌తో సహా మొత్తం 16 జట్లు తలపడనున్నాయి.