ETV Bharat / sports

'థామస్ అండ్ ఉబర్ కప్ నిర్వహణ సురక్షితమేనా?'

author img

By

Published : Sep 13, 2020, 10:24 PM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న వేళ థామస్​ అండ్​ ఉబర్​ కప్​పై అనేక సందేహాలు నెలకొంటున్నాయి. ఇటువంటి సమయంలో టోర్నీ నిర్వహణ సురక్షితమేనా అని భారత బ్యాడ్మింటన్ స్టార్​ సైనా నెహ్వాల్​ ప్రశ్నించింది.

Nehwal
సైనా నెహ్వాల్​

కరోనా వ్యాప్తి మధ్య అక్టోబర్​లో ప్రారంభం కానున్న థామస్​ అండ్​ ఉబర్​ కప్​ టోర్నీపై​ బ్యాడ్మింటన్​ స్టార్​ సైనా నెహ్వాల్​ ఆందోళన వ్యక్తం చేసింది. మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో టోర్నీ నిర్వహణ ఎంత వరకు సురక్షితమని ప్రశ్నించింది. ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్​ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. ఇప్పటికే ఏడు దేశాలు ఈ టోర్నీ నుంచి తప్పుకున్నాయి. ఈ క్రమంలోనే సైనా ట్విట్టర్​ వేదికగా స్పందించింది.

అయితే స్పోర్స్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్దేశించిన క్వారంటైన్ నిబంధనలను ఆటగాళ్లు అంగీకరించలేదు. దీంతో హైదరాబాద్​లో ఏర్పాటు చేసిన శిక్షణా శిబిరాన్ని రద్దు చేయాల్సి వచ్చింది. అక్టోబరు 3న డెన్మార్క్​ వేదికగా థామస్​ అండ్​ ఉబర్​ కప్​ టోర్నీ ప్రారంభం కానుంది. అదే నెల 11న చివరి మ్యాచ్​ జరగనుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.