ETV Bharat / sports

లంక ప్రీమియర్ లీగ్​లో మాటల యుద్ధం - లంక ప్రీమియర్​ లీగ్​లో నోరు జారిన నవీన్​

లంక ప్రీమియర్​ లీగ్​లో... పాకిస్థాన్​ ఆటగాళ్లు మహ్మద్ అమిర్, షాహిద్ అఫ్రిదితో వాగ్వాదానికి దిగాడు అఫ్గాన్​ పేసర్ నవీన్ ఉల్ హక్. గాలె ఇన్నింగ్స్‌ చివర్లో అమిర్​తో గొడవపడ్డ నవీన్, మ్యాచ్​ ముగిశాక అఫ్రిదిపై నోరు జారాడు.

Naveen ul haq
లంక ప్రీమియర్ లీగ్​లో అఫ్గాన్​ ఆటగాడి మాటల యుద్ధం
author img

By

Published : Dec 1, 2020, 4:36 PM IST

లంక ప్రీమియర్‌ లీగ్‌లో భాగంగా గత రాత్రి జరిగిన గాలె గ్లాడియేటర్స్‌, కాండీ టస్కర్స్‌ మ్యాచ్‌లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. అఫ్గానిస్థాన్‌ యువ పేసర్‌ నవీన్‌ ఉల్‌ హక్‌.. పాకిస్థాన్‌ ఆటగాళ్లు మహ్మద్‌ అమిర్‌, షాహిద్‌ అఫ్రిదితో గొడపడ్డాడు.

మ్యాచ్‌ సందర్భంగా తొలుత క్యాండీ టస్కర్స్‌ 20 ఓవర్లలో 196/5 స్కోర్‌ సాధించింది. బ్రెండన్‌ టేలర్‌(51), కుశాల్‌ మెండిస్‌(49) మెరుపు బ్యాటింగ్‌ చేశారు. ఛేదనలో దనుష్క గుణతిలక(82) రెచ్చిపోగా మిగతా బ్యాట్స్‌మెన్‌ రాణించలేదు. దీంతో, అఫ్రిది టీమ్‌ 171/7 స్కోర్‌కే పరిమితమై 25 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

మాటలు జారిన అఫ్గాన్​ ఆటగాడు

గాలె ఇన్నింగ్స్‌ చివర్లో మహ్మద్‌ అమిర్‌(15) బ్యాటింగ్‌ చేస్తుండగా తొలుత నవీన్‌ నోటికి పనిచెప్పాడు. 18వ ఓవర్‌ వేసిన అతడు మూడో బంతికి గుణతిలకను ఔట్‌ చేయగా, అప్పుడే క్రీజులోకి వచ్చిన అమిర్‌ నాలుగో బంతిని బౌండరీకి బాదాడు. దీంతో నవీన్‌ ఏదో అన్నాడు.

తర్వాత ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌ వేయడానికి నవీన్‌ మరోసారి బంతి అందుకోవడంతో అమిర్‌ తొలి బంతినే సిక్సర్‌గా మలిచాడు. దీంతో మరోసారి అఫ్గాన్‌ పేసర్‌ తన మాటలకు పదునుపెట్టాడు. ఇద్దరి మధ్య పరస్పరం మాటల యుద్ధం మొదలవ్వడంతో ఇతరులు కలుగజేసుకొని వారిని అడ్డుకున్నారు.

మ్యాచ్​ ముగిశాక మరోసారి

ఇక మ్యాచ్‌ పూర్తయ్యాక అమిర్‌ సైతం ఏదో అన్నాడు. చివరికి గాలే జట్టు ఓడిపోయాక ఆటగాళ్లతో కలిసి అఫ్రిది మైదానంలోకి వస్తూ నవ్వుకుంటూ ప్రత్యర్థి ఆటగాళ్లకు షేక్‌హ్యాండ్‌ ఇచ్చాడు. అదే సమయంలో నవీన్‌ కనపడడంతో నవ్వు ఆపేసి ఏమైందని అడిగాడు. దాంతో అఫ్గాన్‌ పేసర్‌ మరోసారి మాటల యుద్ధానికి దిగాడు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

ఈ విషయం పక్కనపెడితే లంక ప్రీమియర్‌ లీగ్‌లో అఫ్రిది నాయకత్వం వహిస్తున్న గాలే టీమ్‌ ఇప్పటివరకు 3 మ్యాచ్‌లు ఆడగా ఒక్కటి కూడా విజయం సాధించకపోవడం గమనార్హం.

ఇదీ చదవండి:'నాతో నాకే పోటీ.. నాకు నేనే సాటి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.