ఐపీఎల్లో ఐదుసార్లు విజేతగా నిలిచి రికార్డు సృష్టించింది ముంబయి ఇండియన్స్. గతేడాది ఫైనల్లో దిల్లీ క్యాపిటల్స్‌పై గెలిచి ట్రోఫీ కైవసం చేసుకుంది. రోహిత్ శర్మ సారథ్యంలోని ఈ జట్టు ఈసారి కూడా అద్భుతాలు చేయాలని చూస్తోంది. ఏప్రిల్ 9న ప్రారంభంకానున్న 14వ సీజన్ కోసం తన కొత్త జెర్సీని సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది.
![Mumbai Indians new jersey](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11179121_as.jpg)
ఐపీఎల్ మొదటి రెండేళ్లు లేత నీలం రంగు జెర్సీ ధరించిన ముంబయి.. ఆ తర్వాత నుంచి ముదురు నీలం రంగు జెర్సీలను ధరిస్తోంది. ఈసారి కూడా అదే రంగుతో బంగారు వర్ణం షేడ్స్‌తో రూపొందించిన జెర్సీ ఆకట్టుకుంటోంది. భుజం, పక్కలకు ఇరువైపులా బంగారు రంగు షేడ్స్‌తో జెర్సీని తయారు చేశారు. దాదాపు పాత దుస్తులనే పోలిన ఈ జెర్సీలో ఆరెంజ్ కలర్ షేడ్స్ కాస్త ఆకర్షణగా ఉన్నాయి. చేతులు, కాలర్ చివరన ఈ రంగు బోర్డర్ కనిపిస్తోంది.
-
One Team. #OneFamily. One Jersey. 💙
— Mumbai Indians (@mipaltan) March 27, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Presenting our new MI jersey for #IPL2021 👕✨
Paltan, pre-order yours from @thesouledstore now - https://t.co/Oo7qj5m4cN#MumbaiIndians pic.twitter.com/F0tBT6TXcq
">One Team. #OneFamily. One Jersey. 💙
— Mumbai Indians (@mipaltan) March 27, 2021
Presenting our new MI jersey for #IPL2021 👕✨
Paltan, pre-order yours from @thesouledstore now - https://t.co/Oo7qj5m4cN#MumbaiIndians pic.twitter.com/F0tBT6TXcqOne Team. #OneFamily. One Jersey. 💙
— Mumbai Indians (@mipaltan) March 27, 2021
Presenting our new MI jersey for #IPL2021 👕✨
Paltan, pre-order yours from @thesouledstore now - https://t.co/Oo7qj5m4cN#MumbaiIndians pic.twitter.com/F0tBT6TXcq
రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్, బుమ్రా వంటి దేశీయ టీ20 స్పెషలిస్టులతో కూడిన ఈ జట్టు ఈసారి కూడా ఫేవరెట్స్‌గా బరిలో దిగబోతుంది. ఈ జట్టు మొదటి మ్యాచ్‌లో ఏప్రిల్ 9న కోహ్లీ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది.