ETV Bharat / sports

ప్రపంచకప్‌ విన్నింగ్‌ సిక్సర్.. మహీకే ఆ సీట్‌ అంకితం - 2011 ప్రపంచకప్‌ విన్నింగ్‌ సిక్స్‌ వార్తలు

శ్రీలంక పేసర్​ కులశేఖర వేసిన బంతిని లాంగాన్​ మీదుగా మహేంద్ర సింగ్​ ధోనీ స్టాండ్స్​లో పడేసిన దృశ్యం గుర్తుందా..! భారత క్రికెట్​ అభిమానికి చిరకాలం గుర్తుండే సిక్సర్​ అది. ఎందుకంటే సుదీర్ఘ నిరీక్షణ అనంతరం దేశానికి ప్రపంచకప్​ను అందించిన షాట్​ అది. 2011 ప్రపంచకప్​ విన్నింగ్​ షాట్​. అప్పుడు ధోనీ కొట్టిన బంతి ఎక్కడ పడిందో.. ఇకపై ఆ కుర్చీని మహీకి అంకితం చేయనున్నారు.

dhoni seat in whankade
ప్రపంచకప్‌ విన్నింగ్‌ సిక్స్‌.. మహీకి ఆ సీట్‌ అంకితం
author img

By

Published : Aug 19, 2020, 7:00 AM IST

Updated : Aug 19, 2020, 7:12 AM IST

2011 ప్రపంచకప్‌ ఫైనల్లో ధోనీ కొట్టిన విన్నింగ్ సిక్స్‌ క్రికెట్‌ ప్రేమికుల మదిలో చిరకాలం నిలిచి ఉంటుంది. ఎన్నో ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం దేశానికి ప్రపంచకప్​ అందించిన షాట్​ అది. అందుకే ఆ గెలుపు జ్ఞాపకాలను మరింత పదిలం చేసేందుకు ముంబయి క్రికెట్‌ అసోసియేషన్‌ (ఎంసీఏ) సన్నాహాలు చేస్తోంది. అంతర్జాతీయ క్రికెట్​కు ధోనీ వీడ్కోలు పలికిన నేపథ్యంలో.. భారత క్రికెట్​కు అతడు చేసిన సేవలకు గుర్తింపుగా మహీ పేరిట సీటు ఏర్పాటు చేయనుంది.

dhoni sixer in 2011 worldcup final
ధోనీ విన్నింగ్​ షాట్​

వాంఖడే స్టేడియంలో ఆ బాల్​ పడిన సీట్‌తో పాటు ప్రాంతాన్ని అందంగా అంకరించాలనుకుంటోంది. ఎంసీఏ అపెక్స్‌ కౌన్సిల్ సభ్యుడు ఆజింక్య నాయక్‌ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఎంసీఏకు ఓ లేఖ రాశారు. భారత క్రికెట్‌కు ధోనీ చేసిన అపారమైన సేవలకు కృతజ్ఞతగా బాల్‌ పడిన సీట్‌ను ధోనీకి అంకితమివ్వాల్సిందిగా కోరారు.

"వాంఖడే స్టేడియంతో ధోనీకి ఉన్న బంధాన్ని తెలియజేస్తూ అతడు కొట్టిన ప్రపంచకప్‌ విన్నింగ్‌ సిక్స్‌ జ్ఞాపకాలను పదిలం చేయాలనుకుంటున్నాం. ఆ బాల్‌ పడిన ప్రాంతాన్ని గుర్తించి ఆ సీట్‌ను పెయింట్ వేసి అందంగా అలంకరిస్తాం. ఆ ప్రాంతాన్ని పర్యాటక ఆకర్షణగా తీర్చిదిద్దాలనుకుంటున్నాం"

-- ఆజింక్య నాయక్​, ఎంసీఏ అపెక్స్​ కౌన్సిల్​ సభ్యుడు.

"భారత క్రికెట్‌కు అతడు అందించిన అపారమైన సేవలకు గాను ఆ సీట్‌కు ధోనీ పేరు పెట్టి అతడికి అంకితం ఇవ్వాలనుకుంటున్నాం. భారతీయ క్రికెట్‌ చరిత్రలోనే అత్యద్భుతమైన ఆ క్షణాలను అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా ఉంచాలనుకుంటున్నాం" అని నాయక్​ లేఖలో స్పష్టం చేశారు.

అరుదైన గౌరవం.. భారత్​లో తొలిసారి

భారత్​లో సాధారణంగా క్రికెటర్ల పేరున స్టేడియంలో స్టాండ్స్​ ఏర్పాటు చేస్తుంటారు. ఇలా సీట్లు ఏర్పాటు చేయడం మనదేశంలో తొలిసారి. అయితే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్​లో సాధారణమే. 2015 ప్రపంచకప్​లో డేల్​ స్టెయిన్​ బౌలింగ్​లో భారీ సిక్సర్​ కొట్టి గ్రాంట్​ ఇలియట్​ న్యూజిలాండ్​ను ఫైనల్​ చేర్చాడు. అతడి గౌరవార్థం ఆ బంతి ఎక్కడైతే పడిందో ఆ కుర్చీని ఇలియట్​ పేరిట ఏర్పాటు చేశారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Last Updated : Aug 19, 2020, 7:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.