ETV Bharat / sports

'ఆ విషయంలో ధోనీ అడుగుజాడల్లోనే కోహ్లీ'

author img

By

Published : Apr 6, 2020, 1:17 PM IST

స్వదేశంలో మ్యాచ్​లు జరుగుతున్నప్పుడు ఓ విషయంలో మాజీ కెప్టెన్ ధోనీ అడుగుజాడల్లోనే కోహ్లీ నడుస్తున్నాడని చెప్పాడు భారత మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్. ఇంతకీ విరాట్ ఏం చేస్తున్నాడు?

'ఆ విషయంలో ధోనీ అడుగుజాడల్లోనే కోహ్లీ వెళుతున్నాడు'
ధోనీ గావస్కర్

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే ఎన్నో రికార్డులు తన నమోదు చేసిన మహీ.. విజయవంతమైన సారథిగానూ పేరు తెచ్చుకున్నాడు. మైదానంలో కెప్టెన్ కూల్ అనిపించుకున్న ఇతడు.. తన స్వభావంతో ఎన్నోసార్లు అభిమానుల మనసు గెల్చుకున్నాడు. ఇప్పుడు అలాంటి ఓ విషయాన్నే చెప్పాడు భారత మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత సునీల్ గావస్కర్.

"స్వదేశంలో మ్యాచ్​ జరిగిన తర్వాత ఇరుజట్లు ఓ వేదిక నుంచి మరో వేదికకు ఛార్ట్​డ్ ఫ్లైట్​లో ప్రయాణిస్తాయి. అందులోని బిజినెస్ క్లాస్​లో కెప్టెన్, కోచ్, మేనేజర్​ కోసం పరిమిత సీట్లు ఉంటాయి. వీరితో పాటే మ్యాచ్​లో అద్భుత ప్రదర్శన చేసిన వారు అక్కడ కూర్చొనే అవకాశం ఉంది. కానీ కెప్టెన్సీ అందుకున్న తర్వాత కూడా ధోనీ.. చాలాసార్లు అక్కడ కాకుండా ఎకానమీ క్లాస్​లో, టెక్నికల్, టీవీ సిబ్బందితో కలిసి కూర్చుంటాడు. అతడి స్వభావానికి ఇదే నిదర్శనం" -సునీల్ గావస్కర్, భారత మాజీ క్రికెటర్

ప్రస్తుత సారథి కోహ్లీ.. ఈ విషయంలో ధోనీ అడుగుజాడల్లోనే నడుస్తున్నాడని అన్నాడు గావస్కర్. గత మ్యాచ్​ల్లో విజయానికి కారణమైన బౌలర్​కు, బిజినెస్​ క్లాస్​లో తన సీట్ ఇచ్చేస్తాడని చెప్పాడు.

virat kohli
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.