భారత క్రికెట్ చరిత్రలో గొప్ప ఆటగాడిగా, ముందుండి జట్టును నడిపించే సారథిగా.. అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన ఎంఎస్ ధోనీ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా వెస్టిండీస్ క్రికెటర్ డ్వేన్ బ్రావో.. ధోనీపై కంపోజ్ చేసిన ప్రత్యేక గీతాన్ని విడుదల చేశాడు. ఇప్పటి వరకు మహి క్రికెట్ ప్రయాణాన్ని ఆధారంగా చేసుకొని తాను స్వయంగా పాట రాసి 'హెలికాప్టర్' పేరుతో ట్విట్టర్లో బ్రావో పోస్ట్ చేశాడు. 'నా సోదరుడి పుట్టిన రోజుకు ప్రత్యేక బహుమానం' అంటూ అభిమానులతో పంచుకున్నాడు. బ్రావోకు ధోనీ అంటే ఎంతో ఇష్టం. వీరిద్దరి మధ్య విడదీయరాని స్నేహబంధం ఉంది. చెన్నై సూపర్‌కింగ్స్ తరఫున ఈ ద్వయం ఎన్నో అద్భుతాలు చేసింది.
-
The Helicopter 7 has taken off! @DJBravo47's tribute to #Thala @msdhoni, his brother from another mother! #HappyBirthdayDhoni #WhistlePodu 🦁💛 pic.twitter.com/KAs8gGFIzt
— Chennai Super Kings (@ChennaiIPL) July 6, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">The Helicopter 7 has taken off! @DJBravo47's tribute to #Thala @msdhoni, his brother from another mother! #HappyBirthdayDhoni #WhistlePodu 🦁💛 pic.twitter.com/KAs8gGFIzt
— Chennai Super Kings (@ChennaiIPL) July 6, 2020The Helicopter 7 has taken off! @DJBravo47's tribute to #Thala @msdhoni, his brother from another mother! #HappyBirthdayDhoni #WhistlePodu 🦁💛 pic.twitter.com/KAs8gGFIzt
— Chennai Super Kings (@ChennaiIPL) July 6, 2020
చెన్నై సూపర్ కింగ్స్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలోనూ ధోనీ పాటను పోస్ట్ చేసి.. 'హెలికాప్టర్ 7 వచ్చేసింది' అని కాప్షన్ పెట్టింది. దీంతో ధోనీ అభిమానులు నెట్టింట్లో పండగ చేసుకుంటున్నారు.
అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఐసీసీ ట్రోఫీలు గెలిచిన ఏకైక సారథి మహేంద్ర సింగ్ ధోనీ. టీమ్‌ఇండియాకు 2007లో టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే ప్రపంచకప్, 2013లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ అందించాడు. ఇక ఇండియన్ ప్రీమియర్‌లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను మూడుసార్లు విజేతగా నిలిపాడు ధోనీ.
ఇదీ చూడండి:అత్యుత్తమ కెప్టెన్- రికార్డుల మహేంద్రుడు ధోనీ